Site icon HashtagU Telugu

Anjali: సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న హీరోయిన్ అంజలి మెహందీ ఫొటోస్.?

Anjali

Anjali

టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు హీరోయిన్ అంజలి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంది. తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, జర్నీ సినిమాలలో నటించి మెప్పించింది. అంజలి హీరోయిన్ గా నటించడమే కాకుండా అప్పుడప్పుడు సినిమాలలో ఐటమ్ సాంగ్ లలో చిందులు వేసిన విషయం తెలిసిందే. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా వరుసగా సినిమాలలో నటించి టాప్ హీరోయిన్ లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది.

అంజలి ఇటీవలే టాలీవుడ్ హీరో నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమాలో ఐటమ్ సాంగ్ తో మెప్పించిన విషయం తెలిసిందే. కానీ ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఈ మధ్య కాలంలో సినిమాల కంటే ఎక్కువగా వెబ్ సిరీస్ లలోనే ఎక్కువగా నటిస్తోంది. ఇది ఇలా ఉంది ఈ మధ్యకాలంలో అంజలి తన లుక్ ని పూర్తిగా మార్చేసింది. సన్నబడి స్లిమ్ లుక్ లో అందరిని ఆశ్చర్యపరిచింది. ఇది ఇలా ఉంటే కొంతకాలంగా హీరోయిన్ అంజలి కి సంబంధించిన పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే.

 

అంజలి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోందని వరుడు పారిశ్రామికవేత్త అంటూ రకరకాల వార్తల వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటివరకు ఆ వార్తలపై అంజలి స్పందించ లేదు. ఇది ఇలా ఉంటే తాజాగా అంజలి మెహిందీ ఫోటోలను షేర్ చేయడంతో ఆమె పెళ్లి వ్యవహారం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. తాజాగా కొన్ని మెహందీ ఫోటోలను షేర్‌ చేసింది. ఆ ఫోటోలను చూసిన నెటిజన్లు అంజలికి పెళ్లి కుదిరిందా అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. అంజలి షేర్ చేసిన ఫోటోస్ మెహేంది ఫంక్షన్ కి సంబంధించినవి అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. తమిళ కొత్త సంవత్సరం కావడంతో అభిమానులకు శుభాకాంక్షలు తెలిపిన అంజలి ఇలా తన మెహందీ ఫోటోలను పంచుకుంది. దీనికి క్యాప్షన్‌ కూడా ఇవ్వడంతో అంజలి పెల్లి వార్తలపై క్లారిటీ వచ్చినట్లయ్యింది. దాంతో అభిమానుల ఆశలు అడియాసలు అయ్యాయి.