Tollywood : హీరోలు జీరోలు..కమెడియన్స్ హీరోలు

  • Written By:
  • Publish Date - March 13, 2024 / 02:18 PM IST

టాలీవుడ్ (Tollywood) లో ఈ మధ్య కాలంలో పెద్ద హీరోల పెద్దగా సక్సెస్ లు కొట్టలేకపోతున్నారు. దీనికికారణం మూస కథలను ఎంచుకోవడమే. ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది. కథ కొత్తగా ఉంటె తప్ప థియేటర్స్ కు వెళ్లి సినిమా చూడడం లేదు. ఎంత పెద్ద హీరోయినా..అభిమాన నటుడైన సరే కథ బాగుందా..కొత్త ఉందా అనేది చూస్తున్నారు. ఏమాత్రం బాగాలేదంటే రెండో రోజు నుండే థియేటర్స్ ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి. ఈ మధ్య చిరంజీవి , నాగార్జున , వెంకటేష్ , మహేష్ బాబు ఇలా అగ్ర హీరోల సినిమాలు వచ్చినప్పటికీ అవేవి కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. వీరిని నమ్ముకున్న నిర్మాతలు , డిస్ట్రబ్యూటర్స్ నష్టపోయారు. అదే కథను నమ్మి హీరోలుగా సినిమాలు చేస్తున్న కమెడియన్స్ సూపర్ సక్సెస్ లు అందుకుంటున్నారు.

ప్రస్తుతం చిత్రసీమలో టాప్ కమెడియన్స్​లో వెన్నెల కిశోర్ ఒకరు. ఈయన అతడు ఆమె ఓ స్కూటర్‌తో హీరోగా మారారు. ఆ తర్వాత మళ్లీ కమెడియన్‌గా కొనసాగించారు. ఇప్పుడు తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ చారి 111తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అలాగే షార్ట్​ ఫిలిమ్స్​తో కెరీర్‌ ప్రారంభించి, 2018లో పడి పడి లేచె మనసు చిత్రంతో అరంగేట్రం చేసిన సుహాస్.. కలర్ ఫొటోతో హీరోగా మారి జాతీయ అవార్డు అందుకున్నారు. అనంతరం ఫ్యామిలీ డ్రామా, రైటర్‌ పద్మభూషణ్‌, అంబాజీపేట మ్యారేజి బ్యాండు వంటి సూపర్ హిట్ చిత్రాలతోఒక్కసారిగా స్టార్ హీరోగా మారాడు. ప్రస్తుతం కేబుల్‌ రెడ్డి, శ్రీరంగ నీతులు, ప్రసన్నవదనం వంటి చిత్రాలు చేస్తున్నాడు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక మల్లేశంతో హీరోగా మారిన కమెడియన్‌ ప్రియదర్శి.. గతేడాది బలగంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. మంగళవారం చిత్రంలోనూ లీడ్ రోల్ పోషించి సూపర్ హిట్ కొట్టాడు. ప్రస్తుతం దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి చేస్తున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. మళ్లీరావా, ఈ నగరానికి ఏమైంది, మీకు మాత్రమే చెప్తా, మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి ఫేమ్​ అభినవ్‌ గోమటం పాపులర్ డైలాగ్​ మస్త్‌ షేడ్స్‌ ఉన్నయ్‌రా. ఈ డైలాగ్​తోనే వచ్చిన సినిమాతో ఆయన హీరోగా మారాడు. షార్ట్‌ఫిల్మ్స్​తో కెరీర్ ప్రారంభించిన వైవా హర్ష కూడా రీసెంట్​గా సుందరం మాస్టర్‌ చిత్రంతో హీరోగా మారారు. ఇది ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

జబర్దస్త్‌ షో తో ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన సుడిగాలి సుధీర్ కూడా సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌తో హీరోగా మారారు. గాలోడు తో సూపర్ హిట్ కొట్టాడు. కాలింగ్‌ సహస్రలో ప్రధాన పాత్ర పోషించారు. త్వరలోనే జి.ఒ.ఎ.టితో అలరించనున్నారు. ఇక మా ఊరి పొలిమేరతో సత్యం రాజేశ్, బుజ్జీ ఇలారాతో ధనరాజ్‌ లు కూడా హీరోలుగా మరి హిట్లు కొట్టారు. ఇలా వరుసగా కమెడియన్లు హిట్లు కొడుతుంటే..అగ్ర హీరోలు మాత్రం హిట్ కొట్టలేకపోతున్నారు. ఇప్పటికైనా మూస కథలు వినడం మానేసి..కాస్త కొత్త గా ట్రై చేస్తే హిట్ కొడతారని ప్రేక్షకులు సలహా ఇస్తున్నారు.

Read Also : CAA: సీఏఏ పై సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఘాటు వ్యాఖ్యలు