తన ఆరోగ్యం పై ప్రచారం అవుతున్న వార్తలపై హీరో విశాల్ (Vishal Health) స్పందించారు. “నేను ఆరోగ్యంగానే ఉన్నాను, ప్రస్తుతానికి ఎలాంటి సమస్యలు కూడా లేవు” అని పేర్కొన్నారు. తల్లిదండ్రులు ఇచ్చిన ధైర్యం వల్ల జీవితంలో ఎదురైన ఎన్నో కష్టాలను తట్టుకుని నిలబడుతున్నానని , నేను ఎప్పటికప్పుడు సినిమాలకు రెస్ట్ తీసుకుంటానని, 3-6 నెలలకోసారి విశ్రాంతి తీసుకుంటానని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. “ప్రస్తుతం నా చేతులు వణకడం లేదు, నా ఆరోగ్యం బాగానే ఉంది” అని స్పష్టం చేసారు.
Sankranti Dishes Dearer : సంక్రాంతి వేళ కాగుతున్న నూనెలు.. ఉడకనంటున్న పప్పులు
విశాల్ హీరోగా నటించిన మద గజ రాజా చిత్రం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జనవరి 12వ తేదీ ఆదివారం విడుదలైంది. ఈ చిత్రం ప్రీమియర్ షోను శనివారం రాత్రి చెన్నైలోని ఓ థియేటర్‌లో ప్రదర్శించారు. ఈ షో విరామ సమయంలో థియేటర్‌కు వచ్చిన ఆయన… ప్రీమియర్ షో చూస్తున్న ప్రేక్షకులు, మీడియాను ప్రత్యేకంగా అభినందించి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులకు చెక్ పెట్టారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని తెలిపారు.
‘మా నాన్న అంటే నాకెంతో ఇష్టం. ఆయన వల్లే నేనెంతో ధైర్యంగా ఉన్నా. జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా తట్టుకుని నిలబడుతున్నా. ఈ విషయాన్ని ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే.. మూడు లేదా ఆరు నెలలకొకసారి సినిమాల నుంచి విశ్రాంతి తీసుకుని వెళ్లిపోతున్నానని కొంతమంది అంటున్నారు. ప్రస్తుతం నాకు ఎలాంటి సమస్యల్లేవు. అంతా బాగానే ఉంది. ఇప్పుడు నా చేతులు వణకడం లేదు. మైక్ కూడా కరెక్టుగా పట్టుకోగలుగుతున్నా. ఇటీవల మీరు చూపించిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. నా తుది శ్వాస వరకూ మీ అభిమానాన్ని మర్చిపోను. గెట్ వెల్ సూన్, కమ్ బ్యాక్ అంటూ మీరు పెట్టిన సందేశాలు కోలుకునేలా చేశాయి’ అని విశాల్ చెప్పుకొచ్చారు.