ఒక సినిమాకి పని చేస్తుంటే ఆ యూనిట్ లో ఎవరో ఒకరి మధ్య గొడవలు వస్తుంటాయి అప్పుడప్పుడు. లేదా అభిప్రాయం బేధాలు తలెత్తొచ్చు. కానీ కొంతమంది మోనార్క్ లా వ్యవహరించి పక్కనవాళ్ళని ఇబ్బందిపెడతారు. తాజాగా హీరో విశాల్(Hero Vishal) మూవీ యూనిట్ తో అలా వ్యవహరించిన ఓ డైరెక్టర్ పై ఫైర్ అవుతూ అతనితో ఇంకెప్పుడు కలిసి పనిచేయను అని అన్నాడు.
హీరో విశాల్ – డైరెక్టర్ మిస్కిన్(Mysskin) కాంబోలో తుప్పరివాలన్ (తెలుగులో డిటెక్టివ్) సినిమా వచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ తీస్తామని ప్రకటించి తుప్పరివాలన్ 2 (Thupparivaalan)కూడా ప్రకటించారు. కానీ ఆ సినిమా ఆగిపోయింది.
ప్రస్తుతం విశాల్ నటించిన మార్క్ ఆంటోనీ(Mark Antony) సినిమా రేపు సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా విశాల్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో డిటెక్టివ్ సినిమా డైరెక్టర్ మిస్కిన్ తో మళ్ళీ పనిచేయను అని అన్నారు.
విశాల్ మాట్లాడుతూ.. మిస్కిన్ తో కలిసి పనిచేయడం మళ్ళీ జరగదు. తుప్పరివాలన్ 2 సినిమా విషయంలో అతను పెట్టిన ఇబ్బందులకు లండన్ రైల్వే స్టేషన్ లో ఒంటరిగా కూర్చొని బాధపడ్డాను. ఆ విషయాలను ఎప్పటికి మర్చిపోలేను. నా స్థానంలో ఇంకెవరైనా పెద్దవాళ్ళు ఉంటే హార్ట్ అటాక్ తో మృతి చెందేవాళ్ళు. నేను కాబట్టి మిస్కిన్ చేసిన పనులని, నష్టాన్ని తట్టుకోగలిగాను. ఒకవేళ మళ్ళీ మిస్కిన్ తో కలిసి తుప్పరివాలన్ 2 మొదలుపెట్టినా అది పూర్తవ్వదు. అందుకే ఆ సినిమా ఆపేశాను. వచ్చే ఏడాది నేనే తుప్పరివాలన్ 2 సినిమా తెరకెక్కిస్తాను. నేనే ఆ సినిమా స్క్రిప్ట్ మీద కూర్చుంటాను అని అన్నారు. దీంతో విశాల్ చేసిన వ్యాఖ్యలు తమిళ పరిశ్రమలో వైరల్ గా మారాయి. మరి దీనిపై డైరెక్టర్ మిస్కిన్ స్పందిస్తాడా చూడాలి.
Also Read : Nagarjuna : నాగార్జున ‘శిరిడిసాయి’ ప్రాజెక్ట్ ఎలా మొదలైందో తెలుసా..?