Site icon HashtagU Telugu

Vijay Devarakonda: విజయ్ దేవరకొండపై అలాంటి వీడియో చేసిన లేడీ ఫ్యాన్స్.. రౌడీ హీరో రియాక్షన్ ఇదే?

Mixcollage 19 Feb 2024 08 07 Am 2520

Mixcollage 19 Feb 2024 08 07 Am 2520

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలోనే గత ఏడాది ఖుషి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి మంచి సక్సెస్ ను సాధించింది. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో నటిస్తున్నాడు విజయ్‌ దేవరకొండ. సీతారామం, హాయ్ నాన్నల బ్యూటీ మృణాళ్‌ ఠాకూర్‌ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదల కాబోతోంది. ఇకపోతే హీరో విజయ్ దేవరకొండకు ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారు మనందరికీ తెలిసిందే. మరి ముఖ్యంగా విజయ్ దేవరకొండకు ఉన్న ఫ్యాన్స్ లో అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే బెంగళూరుకు చెందిన ఇద్దరు విద్యార్థినులు విజయ్ దేవరకొండపై చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. బెంగళూరులో చదువుకుంటున్న హర్షిత రెడ్డి అనే స్టూడెంట్‌ త‌న ఫ్రెండ్‌తో క‌లిసి సోష‌ల్ మీడియాలో ఒక రీల్ క్రియేట్ చేసింది. విజయ్ దేవరకొండ ఈ వీడియోకి కామెంట్ చేస్తే తాము పరీక్షలకు ప్రిపేర్ అవుతాం అంటూ ఈ వీడియో ఉంది.

 

షేర్ చేసిన కొద్ది క్షణాల్లోనే ఈ వీడియో నెట్టింట బాగా వైరల్ గా మారింది. చివరకు విజయ్‌ దేవరకొండ దాకా వెళ్లింది వీడియో. అయితే ఆ వీడియో చూసిన హీరో విజయ్ దేవరకొండ వెంటనే స్పందిస్తూ.. 90 శాతం మార్కులు తెచ్చుకో.. కచ్చితంగా నేను నిన్ను కలుస్తాను అంటూ క్యూట్‌గా రిప్లై ఇచ్చాడు. దీంతో ఆ ఇద్దరు విద్యార్థినుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. విద్యార్థినులు అభిమానంతో వీడియో చూసినా విజయ్ స్పందించిన తీరు అభిమానులను ఇంప్రెస్‌ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ గా మారింది. ఆ వీడియో పై అభిమానులు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కామెంట్స్ చేస్తున్నారు.