Hero Tarun: పెళ్లి వార్తలపై హీరో తరుణ్ క్లారిటీ!

టాలీవుడ్ లో రూమర్స్ వినిపించడం కొత్తేమీ కాదు. తాజాగా లవర్ బాయ్ తరుణ్ పై పుకార్లు వినిపించాయి.

  • Written By:
  • Updated On - August 2, 2023 / 02:49 PM IST

Hero Tarun: టాలీవుడ్ లో రూమర్స్ వినిపించడం కొత్తేమీ కాదు. తాజాగా లవర్ బాయ్ తరుణ్ పై పుకార్లు వినిపించాయి. తరుణ్ త్వరలో  ఓ మెగా సెలబ్రిటీని పెళ్లి చేసుకోబోతున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇక తరుణ్ వివాహం ఫిక్సయింది అంటూ కొన్ని వెబ్ సైట్స్ లో కథనాలు రావడంతో హీరో తరుణ్ రియాక్ట్ అయ్యాడు.

ఈ ప్రచారం గురించి ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రచారం నిజం కాదు అని తేల్చి చెప్పారు. నిజంగా తాను ఏదైనా శుభవార్త చెప్పాలనుకుంటే నిరభ్యంతరంగా సోషల్ మీడియా వేదికగా లేదా మీడియా ముఖంగా ఆ విషయం చెబుతానని, తన పెళ్లి విషయంలో ఈ పుకార్లు ఎందుకు పుట్టుకొస్తున్నాయో తెలియడం లేదని అన్నారు. టాలీవుడ్ లో బాల నటుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన తరుణ్ లవర్ బాయ్ ఇమేజ్ తో తెలుగులో అనేక సినిమాలు చేశారు. తరుణ్ కొన్నాళ్లుగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే.

అప్పట్లో తరుణ్ తో ఎక్కువగా సినిమాలు తీసిన ఆర్తి అగర్వాల్( Aarthi Agarwal ) అతన్ని ఎంతగానో ప్రేమించింది. వీళ్లిద్దరూ చాలా రోజులు గాఢంగా ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. కానీ సాధ్యపడలేదు. తరుణ్ పలు హీరోయిన్స్ లవ్ ట్రాక్స్ నడిపినట్టు కూడా వార్తలు వచ్చాయి. ఇప్పటికే వినిపిస్తూనే ఉంటాయి. ఈ బ్యాచిలర్ బాబు పెళ్లి చేసుకుంటేనే ఇలాంటి పుకార్లకు చెక్ పడుతాయని చెప్పక తప్పదు.

Also Read:Pawan Kalyan: రైల్వేలో అర్హత సాధించిన యువతకు ఉద్యోగాలు కల్పించాలి: పవన్ కళ్యాణ్