Suriya : సినీ ఇండస్ట్రీలో సూర్య, జ్యోతిక దంపతుల అన్యోన్యత గురించి చాలా మంచి టాక్ ఉంది. ఒకరినొకరు గౌరవించుకుంటూ.. వారిద్దరూ కెరీర్‌లో ముందుకు సాగుతున్న తీరు అందరికీ స్ఫూర్తిని పంచుతోంది. తాజాగా ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సతీమణి జ్యోతిక గురించి పలు కీలక వివరాలను సూర్య వెల్లడించారు. అవేంటో ఈ వార్తలో తెలుసుకుందాం..
Also Read :Yogi Vs Ajit Pawar :‘బటేంగే తో కటేంగే’ నినాదంపై సీఎం యోగి వర్సెస్ అజిత్ పవార్
‘‘కెరీర్ లక్ష్యాల వల్ల నాకు ఎంతైతే క్లారిటీ ఉందో.. జ్యోతికకు కూడా అంతే క్లారిటీ ఉంది. వాస్తవానికి ఒకప్పుడు నా భార్య జ్యోతిక మూవీ రెమ్యునరేషన్ నా రెమ్యునరేషన్ కంటే మూడు రెట్లు ఎక్కువ’’ అని సూర్య(Suriya) తెలిపారు. ‘‘జ్యోతిక నా కంటే ముందే సినిమాల్లో హీరోయిన్‌గా టాప్ రేంజుకు చేరుకుంది. నేను ఆమె కంటే ఐదేేళ్లు లేటుగా మూవీ ఇండస్ట్రీలో మంచి పేరుతో సెటిలయ్యాను. హీరోగా నాకు ఇమేజ్ రావడానికి, సొంత మార్కెట్ క్రియేట్ కావడానికి చాలా టైం పట్టింది’’ అని ఆయన వివరించారు. ‘‘2003 సంవత్సరంలో కాఖా కాఖా సినిమాలో నేను, జ్యోతిక ఇద్దరం నటించాం. అయితే ఆ మూవీ వాళ్లు నా కంటే మూడు రెట్లు ఎక్కువ రెమ్యునరేషన్‌ను జ్యోతికకు ఇచ్చారు. అయినా నా జీవితంలో ఒక భాగం కావడానికి జ్యోతిక సిద్ధపడింది. అది ఆమె గొప్పతనం’’ అని సూర్య తెలిపారు.
Also Read :Girls Marriage : తొమ్మిదేళ్ల బాలికలనూ పెళ్లాడొచ్చు.. వివాదాస్పద చట్ట సవరణ!
‘‘నాతో పెళ్లి చేసుకుంటాననే విషయాన్ని జ్యోతిక వాళ్ల అమ్మానాన్నలకు చెప్పింది. వాళ్లు వెంటనే అందుకు అంగీకరించారు. ఆ టైంలో వాళ్లు సంపాదన గురించి అస్సలు ఆలోచించలేదు. వాస్తవానికి అప్పుడు జ్యోతిక సంపాదనే ఎక్కువ. కనీసం ఆమె రేంజుకు చేరుకోవాలని అప్పట్లో నేను అనుకున్నాను. ఎట్టకేలకు ఆ లక్ష్యాన్ని చేరుకున్నాను’’ అని సూర్య వివరించారు. మొత్తం మీద ఇటీవల కాలంలో మీడియాకు ఇచ్చిన వరుస ఇంటర్వ్యూలలో తన వ్యక్తిగత జీవితంలోని కీలక ఘట్టాల గురించి సూర్య వెల్లడించారు.