Site icon HashtagU Telugu

Sundeep Kishan: ఆయనకు పీపుల్‌ స్టార్‌ ట్యాగ్‌ ఉందని తెలియదు.. సందీప్‌ కిషన్‌ కామెంట్స్ వైరల్!

Sundeep Kishan

Sundeep Kishan

టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటించిన తాజా చిత్రం మజాకా. ఇందులో రీతు వర్మ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. రావు రమేష్ సందీప్ కిషన్ తండ్రి పాత్రలో నటించాడు. ఈ సినిమా కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంది. నక్కిన త్రినాథ్‌రావు దర్శకత్వంలో సిద్ధమవుతోన్న ఈ చిత్రంలో రీతూ వర్మ, అన్షు కీలక పాత్రల్లో పోషించారు. ఈ సినిమా మహాశివరాత్రి పండుగ కానుకగా ఫిబ్రవరి 26న విడుదల కానుంది.

ఈ సందర్భంగా మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో భాగంగా బిజీబిజీగా ఉన్నారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా తాజాగా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం ను హైదరాబాదులో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ సందర్భంగా సందీప్ కిషన్ మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మీడియా అడిగే ప్రశ్నలకు సందీప్ కిషన్ తో పాటు మిగతా మూవీ మేకర్స్ కూడా ఆసక్తికరంగా వ్యాఖ్యలు చేశారు. ప్రతి సినిమాలో ఏదో ఒక మ్యాజిక్‌ చేస్తుంటారు. మరి దీనిలో ఏదైనా మ్యాజిక్‌ చేశారా? అని అడగగా..

త్రినాథ రావు మాట్లాడుతూ.. దర్శకుడిగా చిత్రీకరణ సమయంలో ప్రతిసీన్‌ లో ఏదో ఒక మ్యాజిక్‌ జరగాలని కోరుకుంటాను. అలా అయితేనే సినిమా వర్కౌట్‌ అవుతుందని నమ్ముతాను. ఇప్పటి వరకూ ప్రతి చిత్రంలో అలాంటి మ్యాజిక్‌ లే జరిగాయి. దీనిలోనూ చోటు చేసుకొన్నాయి. తప్పకుండా బ్లాక్‌ బస్టర్‌ అందుకుంటామని నమ్ముతున్నాను. ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాకుండా ఉండేలా ఎన్నో జాగ్రత్తలు పాటించి తెరకెక్కించాము. ఇద్దరు మగాళ్లు ఉన్న ఒక ఇంట్లో ఏ రోజుకైనా ఒక ఫ్యామిలీ ఫొటో పడాలనే తపనే మజాకా అని తెలిపారు. ఆర్‌.నారాయణ మూర్తికి కూడా పీపుల్‌ స్టార్‌ అనే ట్యాగ్‌ ఉందని మీకు తెలుసా? అని హీరోని అడగగా.. సందీప్ స్పందిస్తూ.. ఆయనకు ఆ పేరు ఉన్న విషయం నాకు తెలియదు. ట్యాగ్‌ ల మీద నేను అంత ఫోకస్‌ పెట్టను. ఎవరినీ హర్ట్‌ చేయాలనే ఉద్దేశం నాకు లేదు. ఈ ట్యాగ్‌ పెట్టిన తర్వాత మాకు విషయం తెలిసింది. ఇబ్బందులు తలెత్తకుండా ఏం చేయాలో కూడా మేము ఆలోచించాము అని తెలిపారు.