Sudheer Babu: సుధీర్ బాబు హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ స్టార్ట్

తెలుగు చిత్ర పరిశ్రమలో కథానాయకుడిగా సుధీర్ బాబుది పదేళ్ళ ప్రస్థానం. ఈ పదేళ్ళలో ఆయన కంటెంట్ ఉన్న సినిమాలు చేశారు. వైవిధ్యమైన పాత్రలు పోషించారు. క్వాంటిటీ కంటే క్వాలిటీకి, వేల్యూస్‌కు ఇంపార్టెన్స్ ఇచ్చారు.

  • Written By:
  • Publish Date - February 12, 2022 / 05:11 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో కథానాయకుడిగా సుధీర్ బాబుది పదేళ్ళ ప్రస్థానం. ఈ పదేళ్ళలో ఆయన కంటెంట్ ఉన్న సినిమాలు చేశారు. వైవిధ్యమైన పాత్రలు పోషించారు. క్వాంటిటీ కంటే క్వాలిటీకి, వేల్యూస్‌కు ఇంపార్టెన్స్ ఇచ్చారు. అదే విధంగా విలువలతో కూడిన, విషయం ఉన్న సినిమాలు నిర్మించే భవ్య క్రియేషన్స్ సంస్థతో ఆయనకు అనుబంధం ఉంది. గతంలో ఈ సంస్థలో ‘శమంతకమణి’ చేశారు. ఇప్పుడు తాజాగా మరో సినిమా చేస్తున్నారు. సుధీర్ బాబు కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ నిర్మించనున్నారు. ఈ సినిమా శనివారం (ఫిబ్రవరి 12) కూక‌ట్‌ప‌ల్లిలోని భవ్యాస్ సముదాయంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిరాడంబరంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

ఈ సందర్భంగా నిర్మాత వి. ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ “హీరోగా పదేళ్ళు పూర్తి చేసుకున్న సుధీర్ బాబుకు కంగ్రాట్స్. ఆయనతో మా సంస్థలో ‘శమంతకమణి’ చేశాం. ఇప్పుడు మరో సినిమా చేస్తుండటం సంతోషంగా ఉంది. ఇదొక హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్. కథ వినగానే సుధీర్ బాబుకు నచ్చేసింది. వెంటనే ఓకే చేశారు. ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో ఆయ‌న‌ కనిపిస్తారు. ఇందులో శ్రీకాంత్, ‘ప్రేమిస్తే’ ఫేమ్ భరత్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. మార్చి 14 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. కథానాయిక, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తాం” అని తెలిపారు. శ్రీకాంత్ మాట్లాడుతూ “భవ్య క్రియేషన్స్ సంస్థలో సుధీర్ బాబు, నేను, భరత్ సినిమా చేస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ నేపథ్యంలో ఒక డిఫరెంట్ స్టొరీతో చేస్తున్న సినిమా ఇది. దర్శకుడు మహేష్ మంచి కథ తీసుకొచ్చారు. ఆనంద ప్రసాద్ గారు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్. ఆయన సంస్థలో, సుధీర్ బాబుతో చేయడం సంతోషంగా ఉంది” అని అన్నారు.

సుధీర్ బాబు మాట్లాడుతూ “భవ్య క్రియేష‌న్స్‌లో ‘శమంతక మణి’ తర్వాత నేను చేస్తున్న చిత్రమిది. నిర్మాత ఆనంద ప్రసాద్ గారు, ఈ సంస్థ అంటే నాకు ఎంతో గౌరవం. చాలా రోజుల నుంచి చాలా మంది యాక్షన్ సినిమా చేయమని అడుగుతున్నారు. అక్కడో ఫైట్, ఇక్కడో ఫైట్ కాకుండా… పూర్తిస్థాయి యాక్షన్ చిత్రమిది. నేను యాక్షన్ సినిమా చేస్తుండడంతో ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఫీలవుతారని అనుకుంటున్నాను. శ్రీకాంత్ గారి వ్యక్తిత్వం, నటన అంటే నాకు ఇష్టం. తమిళ చిత్రాల్లో హీరోగా నటిస్తున్న భరత్, మా సినిమాలో మంచి పాత్రలో నటించడానికి అంగీకరించారు. అతడికి థాంక్స్. శ్రీకాంత్ గారు, భ‌ర‌త్‌తో చేయడం సంతోషంగా ఉంది. యాక్షన్ సినిమా కాబట్టి కొంచెం ఎక్కువ జాగ్రత్త తీసుకుంటాం. ఈ సినిమాకు మహేష్ దర్శకుడు. అతడికి ఆల్ ద బెస్ట్” అని అన్నారు. భరత్ మాట్లాడుతూ “తెలుగులో ‘ప్రేమిస్తే’ సినిమాను అందరూ చూశారు. ఆ తర్వాత నా తమిళ సినిమాలు తెలుగులో డబ్బింగ్ అయ్యాయి. ఇది నా స్ట్రయిట్ తెలుగు సినిమా. నటుడిగా పరిచయమైన 19 ఏళ్ళ తర్వాత తెలుగుకు వస్తున్నాను. ఈ సినిమా నాకు చాలా స్పెషల్. మంచి సంస్థ ద్వారా పరిచయం కావాలని అనుకున్నాను. షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతోందని ఎదురు చూస్తున్నాను” అని అన్నారు.

దర్శకుడు మహేష్ మాట్లాడుతూ “నాకు అవకాశం ఇచ్చిన భవ్య క్రియేషన్స్ ఆనంద ప్రసాద్, అన్నే రవి గారికి థాంక్స్. స్క్రిప్ట్ యాక్సెప్ట్ చేసిన సుధీర్ బాబు గారికి థాంక్స్. ఇంపార్టెంట్ రోల్స్ చేయడానికి అంగీకరించిన శ్రీకాంత్, భరత్ గారికి కూడా థాంక్స్. ఇదొక ఇన్నోవేటివ్ యాక్షన్ థ్రిల్లర్. ఎక్ట్స్రాడిన‌రీ స్టంట్స్ ఉంటాయి” అని అన్నారు.
సినిమాటోగ్రాఫర్ అరుల్ విన్సెంట్‌ మాట్లాడుతూ “మంచి స్క్రిప్ట్, మంచి నిర్మాణ సంస్థలో చేస్తున్న చిత్రమిది. చాలా సంతోషంగా ఉంది.
ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: అరుల్ విన్సెంట్‌, కళ: వివేక్, కూర్పు: ప్రవీణ్ పూడి, దర్శకత్వం: మహేష్, నిర్మాణ సంస్థ: భవ్య క్రియేషన్స్, నిర్మాత: వి. ఆనంద ప్రసాద్.