Thug Life : కమల్, మణిరత్నం సినిమాలోకి మరో హీరో.. లీకైన షూటింగ్ సెట్స్ పిక్స్..

కమల్, మణిరత్నం సినిమాలోకి మరో హీరో ఇచ్చాడు. ఆల్రెడీ షూటింగ్ లో కూడా పాల్గొంటున్న ఆ హీరో. లీకైన షూటింగ్ సెట్స్ పిక్స్..

Published By: HashtagU Telugu Desk
Hero Simbu Played A Key Role In Kamal Haasan Mani Ratnam Thug Life

Hero Simbu Played A Key Role In Kamal Haasan Mani Ratnam Thug Life

Thug Life : 36 ఏళ్ళ క్రిందట వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘నాయకుడు’ తరువాత కమల్ హాసన్, మణిరత్నం మళ్ళీ కలిసి పని చేస్తున్న సినిమా ‘థగ్ లైఫ్’. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మూవీ టైటిల్ ని అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన గ్లింప్స్ తోనే మూవీ పై మేకర్స్ భారీ అంచనాలు క్రియేట్ చేసారు. అంతేకాకుండా నాయకుడు వంటి హిట్ తరువాత ఈ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో.. కమల్ ఫ్యాన్స్ తో పాటు జనరల్ ఆడియన్స్ లో కూడా మంచి ఆసక్తి కనిపిస్తుంది.

ఇక ఆడియన్స్ లో ఈ సినిమాకి ఉన్న అంచనాలను దృష్టిలో పెట్టుకొని మణిరత్నం.. ఈ చిత్రాన్ని భారీగానే తెరకెక్కిస్తున్నారు. ఈక్రమంలోనే ఈ మూవీలో కమల్ తో పాటు మరో హీరోని కూడా చూపించబోతున్నారు. తమిళ్ స్టార్ హీరో శింబు.. ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర చేయబోతున్నారు. ఆల్రెడీ ఈ హీరో థగ్ లైఫ్ సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చి.. తన షూటింగ్ ని కూడా జరుపుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఢిల్లీలో జరుగుతుంది. ఆ షూటింగ్ సెట్స్ నుంచి కొన్ని ఫోటోలు లీక్ అయ్యి నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇది ఇలా ఉంటే, చిత్ర యూనిట్ నుంచి తాజాగా ఓ అప్డేట్ ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ సినిమాలోకి కొత్త థగ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ అప్డేట్ ని మే 8న ఇవ్వబోతున్నట్లు తెలియజేసారు. ఈ అప్డేట్ శింబు గురించే అని తెలుస్తుంది. కాగా మణిరత్నం కమల్ గ్లింప్స్ ని పవర్ ఫుల్ గా డిజైన్ చేసి లోకనాయకుడు ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేసారు. దీంతో ఇప్పుడు శింబు ఫ్యాన్స్.. తమ హీరో గ్లింప్స్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి మణిరత్నం వారిని ఎలా ఆకట్టుకుంటారో చూడాలి.

  Last Updated: 06 May 2024, 05:37 PM IST