Site icon HashtagU Telugu

Sharwanand: హీరో శర్వానంద్‌కి యాక్సిడెంట్.. స్వల్ప గాయాలు.. ఆసుపత్రిలో చేరిక

Sharwanand

Resizeimagesize (1280 X 720) (1) 11zon

Sharwanand: టాలీవుడ్ హీరో శర్వానంద్‌ (Sharwanand)కు శనివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న బ్లాక్ కలర్ రేంజ్ రోవర్ కారు ఫిల్మ్‌నగర్ జంక్షన్ వద్ద అదుపుతప్పింది. ఈ ఘటనలో శర్వానంద్‌కు స్వల్ప గాయాలు కాగా.. అక్కడున్నవారు హుటాహుటిన ఆయనను ఆసుపత్రికి తరలించారు.

విషయం తెలుసుకున్న ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకుని శర్వానంద్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మరోవైపు ఘటనాస్థలం నుంచి కారును సైతం తీసుకెళ్లినట్లు సమాచారం. యాక్సిడెంట్ జరిగిన ప్రదేశం నుంచి శర్వానంద్ కారును కుటుంబ సభ్యులు తీసుకెళ్లిపోయారు. రేంజ్ రోవర్ కారు కావడం వల్ల.. సేఫ్టీ ఫీచర్స్ ఉండటం వల్ల పెద్దగా గాయాలు కాలేదని తెలుస్తోంది. అయితే ఈ ఘటన,మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Also Read: Prithvi Shaw : ప్రియురాలితో పృథ్వీ షా హ‌ల్‌చ‌ల్‌.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన ఫొటో..

మరోవైపు.. జూన్ 2,3 తేదీల్లో శర్వానంద్ వివాహం ఘనంగా జరగనుంది. తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె అయిన రక్షిత రెడ్డిని శర్వానంద్ పెళ్ళి చేసుకుంటున్నారు. రక్షిత ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంటూ ఉద్యోగం చేస్తోందని సమాచారం. జనవరిలో నిశ్చితార్థం జరగ్గా శర్వానంద్-రక్షిత రెడ్డి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారు. ఇందుకు రాజస్థాన్ లోని లీలా ప్యాలెస్ఎంచుకున్నారు. అక్కడ జూన్ 2,3 తేదీల్లో శర్వానంద్-రక్షిత రెడ్డిల వివాహం జరగనుంది. మెహందీ, సంగీత్, హల్దీ ఫంక్షన్స్ గ్రాండ్ గా ప్లాన్ చేశారు.