Rana Daggubati: రాక్షస రాజా వచ్చేస్తున్నాడు, హీరో రానా టెరిఫిక్ లుక్!

హీరో రానా మరో శక్తివంతమైన పాత్రలో నటిస్తున్నాడు. నేనే రాజు నేనే మంత్రి తర్వాత మరోసారి తేజతో పనిచేస్తున్నాడు.

Published By: HashtagU Telugu Desk
Rakshasa Raja

Rakshasa Raja

Rana Daggubati: నేనే రాజు నేనే మంత్రితో బ్లాక్ బస్టర్ తర్వాత రానా దగ్గుబాటి, తేజ రెండోసారి చేతులు కలిపారు. రానా పుట్టినరోజు సందర్భంగా ఆసక్తికరమైన పోస్టర్ తో కొత్త సినిమా టైటిల్‌ను ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రానికి రాక్షస రాజా అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను పెట్టారు. రానా లుక్ టైటిల్‌పై భారీ అంచనాలను పెంచింది. పోస్టర్‌లో తుపాకీ, బుల్లెట్‌లను పట్టుకుని ఉన్నట్లు కనిపిస్తోంది.

సిగార్‌ తాగుతూ రానా పోస్టర్‌లో ఘాటుగా చూస్తున్నాడు. అతను గడ్డంతో గంభీరంగా ఉన్నాడు. విభూతి మరియు తిలకం ధరించాడు. అతను తన రెండు వేళ్లకు పొడవాటి బంగారు ఉంగరాలు కూడా ధరించాడు. టైటిల్ మరియు పోస్టర్ సూచించినట్లుగా రానా గ్యాంగ్‌స్టర్ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో విభిన్న షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు.

నేనే రాజు నేనే మంత్రి హిట్ అయినప్పటి నుండి, ఈ క్రేజీ కాంబినేషన్‌లో మరో చిత్రం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. అహింస మూవీ ఘోర పరాజయం పాలైనప్పటికీ హీరో రానా తేజకు అవకాశం ఇవ్వడం గమనార్హం.

Also Read: Balakrishna: బ్రాండ్ ప్రమోషన్ కు బాలయ్య ఎంత తీసుకుంటున్నాడో తెలుసా!

  Last Updated: 14 Dec 2023, 11:54 AM IST