Site icon HashtagU Telugu

Ram Likes Baby: యంగ్ బ్యూటీకి రామ్ అదిరిపొయే గిఫ్ట్, ఆనందంలో బేబీ హీరోయిన్!

Ram

Ram

మహిళా అభిమానులలో అత్యంత ఇష్టపడే తెలుగు హీరోలలో రామ్ పోతినేని ఒకరు. ఆయనకు మహిళా ఫాలోయింగ్ విపరీతంగా ఉంది. ఇటీవల, బేబీ చిత్రంలో నటించిన యువ తెలుగు నటి వైష్ణవి చైతన్య కూడా రామ్ పోతినేని తన అభిమాన హీరో అని వెల్లడించింది. దీంతో హీరో రామ్ వైష్ణవికి అదిరిపోయే గిఫ్ట్ అందించాడు. ఈ బ్యూటీ బేబీ సినిమాతో ఆకట్టుకున్నందుకుగానూ అభినందనలు తెలుపుతూ ఫ్లవర్ బోకెను పంపించాడు.

యంగ్ హీరోయిన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వైష్ణవి సోషల్ మీడియా ద్వారా రామ్ పంపిన పుష్పగుచ్ఛంతో తన ఫోటోను పంచుకుంది. “పూలు పంపినందుకు ధన్యవాదాలు రామ్ గారూ. నాకు మరియు బేబీ టీమ్‌కి మీ శుభాకాంక్షలు❤️ @ramsayz” అని ఆమె ఫోటోకు క్యాప్షన్ ఇచ్చింది.  హీరో రామ్ తన అభిమాని అమ్మాయిని గుర్తించి ఎంకరేజ్ చేయడం వైరల్ గా మారింది. రామ్ విషయానికొస్తే, బోయపాటి తో స్కంధ, డైరెక్టర్ పూరితో డబుల్ ఇస్మార్ట్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక అలవైకుంఠపురం సినిమాతో ఆకట్టుకున్న వైష్ణవి బేబీ మూవీతో మంచి హిట్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ యంగ్ బ్యూటీకి యూత్ లో మస్త్ ఫాలోయింగ్ ఏర్పడింది.

Also Read: MLC Kavitha: ప్రజలకు ఇబ్బందులు రాకుండా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం