Site icon HashtagU Telugu

Hero Ram: స్కంధ మూవీ కోసం 12 కిలోల బరువు పెరిగా: హీరో రామ్

Ram Skanda 5 Action Blocks

Ram Skanda 5 Action Blocks

బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని యాక్షన్ ఎంటర్‌టైనర్ స్కంద సెప్టెంబర్ 28న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో రామ్ మాస్ హీరోగా నటిస్తున్నాడు. పాత్ర గురించి రామ్ మాట్లాడుతూ “ఇది నాకు నిజమైన సవాలు, మేము సినిమా షూటింగ్ ప్రారంభించినప్పుడు నేను నిజంగా సన్నగా ఉన్నాను. నేను చాలా గంటలు శిక్షణ పొందా. చాలా కేలరీలు వినియోగించా. నా పాత్ర కోసం సిద్ధం కావడానికి నేను 12 కిలోలు పెరిగాన., నేను 72 కిలోల నుండి 84 కిలోలకు చేరుకున్నాను.

రామ్ పాత్ర శక్తివంతంగా ఉంటుంది. దీంతో సినిమా కోసం అవసరమైన మాస్ అప్పీల్‌కు సరిపోయేలా కనిపించాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు. అందుకే అదనపు బరువు పెరిగానని రామ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. స్కందతో పూర్తిస్థాయి మాస్ ఫీస్ట్‌గా రామ్ కనిపించబోతున్నాడు. ఈ మూవీ రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన స్కంద ఇందులో రామ్, శ్రీలీల ప్రధాన పాత్రలు పోషించారు.

కాగా సాధారణంగా బాలకృష్ణ హీరోగా ఉన్న సినిమాల్లో ఎక్కువగా పొలిటికల్ పంచులు వేస్తుంటాడు బోయపాటి శ్రీను. సింహ, లెజెండ్, అఖండ లాంటి సినిమాలలో పొలిటికల్ డైలాగ్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. అయితే ఇప్పుడు విచిత్రంగా రామ్ హీరోగా ఉన్న సినిమాలో కూడా పొలిటికల్ డైలాగ్స్ ఉండడం ఆసక్తి రేకెత్తిస్తుంది.పైగా ఈ సినిమా కథ కూడా ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చుట్టూ తిరుగుతుందని ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ లో చూడొచ్చు.