Site icon HashtagU Telugu

Rajashekar : హీరో రాజశేఖర్‌‌ని ప్రభుదేవా ఏమని పిలుస్తాడో తెలుసా..?

Hero Rajashekar and Prabhudeva Relation

Hero Rajashekar and Prabhudeva Relation

సీనియర్ హీరో రాజశేఖర్‌(Rajashekar) ‘అంకుశం’ వంటి సినిమాలతో తెలుగు ఆడియన్స్ లో ‘యాంగ్రీ యంగ్‌మెన్‌’గా గుర్తింపు సంపాదించుకున్నారు. ముఖ్యంగా పోలీసు పాత్రలతో రాజశేఖర్ బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించేవారు. ఆ సమయంలో కమర్షియల్ యాక్షన్ హీరోగా చిరంజీవి(Chiranjeevi), రాజశేఖర్ కి మధ్య పోటీ కూడా ఉండేది. కానీ తరువాత సరైన హిట్టులు పడక రాజశేఖర్ వెనకపడిపోయారు. అయితే 2017లో వచ్చిన ‘పీఎస్‌వీ గరుడవేగ’ సినిమా రాజశేఖర్ కెరీర్ కి ఒక కిక్ స్టార్ట్ అయ్యింది. అక్కడి నుంచి ఆయన సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది అని చెప్పవచ్చు. ఆ తరువాత ‘కల్కి'(Kalki) కూడా మంచి విజయం సాధించింది.

ప్రస్తుతం ఏడాది ఒక సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకువస్తూ అలరిస్తున్నాడు. ఇక అసలు విషయానికి వస్తే.. స్టార్ డాన్స్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా (Prabhu Deva) రాజశేఖర్ ని ఏమని పిలుస్తాడో తెలుసా..? వీరిద్దరూ కలిసి అప్పటిలో పలు సినిమాలకు పని చేశారు. అయితే రాజశేఖర్ డాన్స్ అంటే మనకి మొదట గుర్తుకు వచ్చే సినిమా ‘అల్లరి ప్రియుడు’. లవ్ అండ్ మ్యూజికల్ ఎంటర్టైనర్ గా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రాజశేఖర్ కెరీర్ లో గుర్తుండి పోయే చిత్రంలా నిలిచింది. ఇక ఈ మూవీ మ్యూజికల్ బ్యాక్‌డ్రాప్ కావడంతో డాన్స్ కూడా వేయాల్సి వచ్చేది.

కానీ రాజశేఖర్ కి డాన్స్ వచ్చేది కాదు. దీంతో ఆ సినిమాలోని సాంగ్స్ కి రాజశేఖర్ వేసేలా ప్రభుదేవా డాన్స్ కోరియోగ్రఫీ చేసేవాడట. అయినాసరి రాజశేఖర్ కొన్ని స్టెప్పులు వేయలేకపాయేవాడట. అయితే ప్రభుదేవా మాత్రం రాజశేఖర్ పై ఈ విషయంలో ఎప్పుడు అసహనం వ్యక్తం చేయలేదట. ఫ్రేమ్ లో రాజశేఖర్ పక్కన ఉండే డాన్సర్స్ కి.. ఆయన ఎలా వేస్తే మీరు అలానే వెయ్యాలి అని చెప్పేవాడట. ఇక ఈ డాన్స్ విషయంలో ప్రభుదేవా, రాజశేఖర్ ని సరదాగా ఒక ముద్దు పేరుతో పిలిచేవాడట. ఇండియన్ మైకేల్‌ జాక్సన్‌ అని పేరు సంపాదించుకున్న ప్రభుదేవా ‘డాక్టర్‌ మైకేల్ జాక్సన్‌’ అని రాజశేఖర్ ని పిలిచేవాడట. ఈ విషయాలన్ని రాజశేఖర్ ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. రాజశేఖర్ నిజ జీవితంలో డాక్టర్ కూడా చదివిన సంగతి తెలిసిందే.

 

Also Read : Nithin: పవన్ కళ్యాణ్ టైటిల్‌తో హీరో నితిన్ కొత్త సినిమా.. డైరెక్టర్ కూడా పవన్ అభిమానే..!