Site icon HashtagU Telugu

Tollywood : మరోసారి సందడి చేయబోతున్న ‘హ్యాపీ డేస్’

Happy Days Re Release

Happy Days Re Release

టాలీవుడ్ (Tollywood) లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. హీరోల పుట్టిన రోజు నాడు వారు నటించిన సూపర్ హిట్ చిత్రాలను , పాపులర్ చిత్రాలను రీ రిలీజ్ చేసి అభిమానులను అలరిస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ , బాలకృష్ణ , వెంకటేష్ , నాగార్జున , మహేష్ బాబు , ఎన్టీఆర్ , రామ్ చరణ్ , ప్రభాస్ , అల్లు అర్జున్ తదితర హీరోల తాలూకా చిత్రాలు రీ రిలీజ్ అయ్యి ఆకట్టుకోగా…ఇప్పుడు మరో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

ఇంజనీరింగ్ లైఫ్, ఫ్రెండ్షిప్ నేపథ్యంలో వచ్చిన హ్యాపీ డేస్ (Happy Days) మూవీ రీ రిలీజ్ కు సిద్ధమైంది. 2007 లో శేఖర్ కమ్ముల (Sekhar Kammula) డైరెక్షన్లో వరుణ్ సందేశ్ (Varun Sandesh), తమన్నా (Tamanna), రాహుల్, నిఖిల్ (Nikhil), వంశీకృష్ణ, గాయత్రి రావు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ మూవీ అప్పట్లో సంచలనం సృష్టించింది. ముఖ్యంగా యూత్ అయితే ఈ సినిమాకు బ్రహ్మ రథంపట్టారు. దాదాపు మూడు , నాలుగు సార్లు ఈ చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేసారు. ఈ మూవీ కి వరుణ్ , నిఖిల్ , తమన్నా లకు మంచి పేరు తీసుకురావడమే కాదు వారిని స్టార్స్ గా మార్చింది. ఈ మూవీ విడుదలై ఈ ఏడాదితో 18 ఏళ్లు విజయవంతంగా పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మళ్లీ థియేటర్స్ లో సందడి చేసేందుకు సిద్ధమైంది.

Read Also : Greaves Electric Cargo: మార్కెట్లోకి గ్రీవ్స్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ గ్రీవ్స్‌ ఎలా్ట్ర విడుదల.. మరిన్ని వివరాలు ఇవే?

ఫిలిం నగర్ సమాచారం ప్రకారం సెప్టెంబర్ 28న ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ (Happy Days Re Release) కానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా హీరో నిఖిల్ తన ట్విట్టర్లో..” హ్యాపీడేస్ రీ రిలీజ్, ఓకేనా?” అంటూ ట్వీట్ చేశాడు. దాంతో నెటిజన్స్ అంతా ఈ ట్వీట్ కి రిప్లై ఇస్తూ ‘రీరిలీజ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నామంటూ తెలిపారు. కాగా ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం నిఖిల్ వరుస విభిన్న చిత్రాలు చేస్తూ అలరిస్తున్నాడు. వరుణ్ సినిమాలు లేక అడ్రెస్ లేకుండా పోయాడు. తమన్నా అదే హావ కొనసాగిస్తుంది. శేఖర్ కమ్ముల సైతం అంతే స్లో గా ఏడాదికో , రెండేళ్లకో ఓ సినిమా చేస్తూ వస్తున్నాడు.