Site icon HashtagU Telugu

Nikhil : తండ్రైన హీరో నిఖిల్..

Hero Nikhil And His Wife Pa

Hero Nikhil And His Wife Pa

హ్యాపీ డేస్ (Happy Days) ఫేమ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ (Nikhil ) తండ్రయ్యారు. ఈరోజు (ఫిబ్రవరి 21) ఉదయం ఆయన సతీమణి పల్లవి (Pallavi) పండంటి మగబిడ్డ (Baby Boy)కు జన్మనిచ్చింది. ఈ సందర్బంగా నిఖిల్ తన కుమారుడిని ముద్దాడిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరలవుతోంది. ఈ విషయం తెలిసిన సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా విషెష్ అందజేస్తున్నారు.

హ్యాపీ డేస్ మూవీ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న నిఖిల్..ఆ తర్వాత విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు కొత్తదనం అందిస్తూ వస్తున్నారు. స్వామి రారా, ఎక్కడికి పోతావు చిన్నవాడా, కార్తికేయ , కార్తికేయ 2 , 18 పేజెస్ ఇలా సరికొత్త కథలతో ఆకట్టుకుంటూ వచ్చాడు. 2020 లాక్ డౌన్ సమయంలో నిఖిల్ తన ప్రేయసి పల్లవిని పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన తర్వాత ఈ జంట పెద్దగా బయట ఎక్కడా కనిపించలేదు. కాగా, నిఖిల్-పల్లవి విడిపోతున్నారు అంటూ ఈ మధ్య సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని, అందుకే త్వరలో విడాకులు తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు పుకార్లు వచ్చాయి. అయితే వీటిపై నిఖిల్ తన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు. తన భార్యతో క్లోజ్ గా ఉన్న ఓ ఫోటోను సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. దీంతో ఆ విడాకుల వార్తలకు చెక్ పడింది. ఇక ఇప్పుడు తండ్రి పోస్ట్ కొట్టేసి అభిమానుల్లో ఆనందం నింపారు.

We’re now on WhatsApp. Click to Join.

నిఖిల్ ప్రస్తుతం భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ మూవీకి స్వయంభూ అనే పేరు పెట్టారు. ఇది నిఖిల్ సినిమాల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న చిత్రంగా తెలుస్తోంది. ఈ మూవీ కోసం నిఖిల్ మూడు నెలలు వియత్నం కూడా వెళ్లారట. అక్కడ యుద్ధవిద్యలు నేర్చుకున్నట్లు సమాచారం.

Read Also : Donated Rs 335 Cr To BJP: ఈడీ, ఐటీ విచారణను ఎదుర్కొంటున్న 30 సంస్థలు.. బీజేపీకి రూ.335 కోట్లు విరాళం..!