గత సంవత్సరం SS రాజమౌళి RRR ఉత్తమ ఒరిజినల్ పాటగా ఆస్కార్ గెలుచుకుంది. దీంతో ఈ ఏడాది చాలా సినిమాలు ఆస్కార్ బరిలో నిలువబోతున్నాయి. గత సంవత్సరం RRRని పంపినప్పటికీ కేవలం పాటకు మాత్రమే అవార్డు వచ్చింది. ఈ ఏడాదిగాను గిరీష్ కాసరవల్లి నేతృత్వంలోని 17 మంది సభ్యుల ఆస్కార్ కమిటీ చెన్నైలోని ప్రక్రియను ప్రారంభించింది.
వాటిలో రెండు తెలుగు సినిమాలు నాని దసరా, బలగం ముందు వరుసలో ఉన్నాయి. ఇతర చిత్రాలు ది స్టోరీ టెల్లర్ (హిందీ), మ్యూజిక్ స్కూల్ (హిందీ), మిసెస్ ఛటర్జీ Vs నార్వే (హిందీ), 12వ ఫెయిల్ (హిందీ), ఘూమర్ (హిందీ), గదర్ 2 (హిందీ), రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ (హిందీ) ), విదుతలై పార్ట్ 1 (తమిళం), వాల్వి (మరాఠీ), బాప్ లియోక్ (మరాఠీ), ది కేరళ స్టోరీ (హిందీ), జ్విగాటో (హిందీ) పోటీలో ఉన్నాయి. సెప్టెంబరు 20న చెన్నైలో స్క్రీనింగ్‌లు ప్రారంభం కాగా ఈ నెలాఖరులోగా నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.
మన దసరా, బలగం చిత్రాలలో ఒకటి తుది జాబితాలో చేరి, భారతదేశం నుండి అధికారిక ఎంట్రీగా ఆస్కార్‌లోకి ప్రవేశిస్తుందని ఆశిద్దాం. ఆర్ఆర్ఆర్ తర్వాత మన తెలుగు సినిమాలు ప్రపంచ వేదికల మీద సత్తా చాటుతున్నాయి. అల్లు అర్జున్ పుష్ప, నాని దసరా, దిల్ రాజు మూవీ బలగం సినిమాలు ప్రేక్షకుల మనసులను దోచుకోవడమే కాకుండా భారీ కలెక్షన్లు సాధించాయి. అంతేకాదు.. ఈ సినిమాల్లోని నటీనటులకుగానూ మంచి మార్కులు పడ్డాయి.
Also Read: Harish Rao: మా ఇంటి ఓట్లన్నీ హరీష్ రావుకే.. సిద్దిపేటలో పోస్టర్స్ వైరల్