Site icon HashtagU Telugu

విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న హీరో కార్తీ

Karthi Vjd

Karthi Vjd

సత్యం సుందరం మూవీ ప్రమోషన్ లో భాగంగా విజయవాడ కు వచ్చిన హీరో కార్తీ (Hero Karthi ) .. దుర్గమ్మను దర్శించుకున్నారు. కార్తీ కి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు దేవస్థాన అధికారులు. అమ్మవారిని దర్శించుకున్న హీరో కార్తీ, హీరోయిన్ శ్రీ దివ్య..దర్శనంతరం వేద పండితులు వేదశీర్వచనలు అందజేశారు.

ఈసందర్భంగా మీడియాతో కార్తీ మాట్లాడారు. ‘ఆరేళ్ల తర్వాత విజయవాడ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవడం ఆనందంగా ఉంది. అందరూ బాగుండాలని కోరుకున్నా. ‘సత్యం సుందరం’ను (Satyam Sundaram) కుటుంబసమేతంగా వెళ్లి చూసి ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈరోజు ఉదయం నాగార్జున గారు ఈ సినిమా గురించి ట్వీట్‌ చేశారు. సినిమాను ఆదరిస్తున్నందుకు అందరికీ కృతజ్ఞతలు. ప్రస్తుతానికి పొలిటికల్‌ సినిమాలు చేయడం లేదు. రానున్న ప్రాజెక్ట్‌ వివరాలు త్వరలోనే ప్రకటిస్తా’ అని చెప్పారు.

కార్తి (Karthi), అరవింద్ స్వామి (Aravind Swamy) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సత్యం సుందరం’. సూర్య, జ్యోతిక దంపతులు స్వయంగా నిర్మించారు. తమిళ్ తో పాటు తెలుగు లో విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. తమిళంలో ఈ నెల 27 న రిలీజ్ అవ్వగా..తెలుగు లో మాత్రం నిన్న రిలీజ్ అయ్యింది.

Read Also : Tension at Telangana Bhavan : తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత..