Balakrishna: బ్రాండ్ ప్రమోషన్ కు బాలయ్య ఎంత తీసుకుంటున్నాడో తెలుసా!

హీరో బాలయ్య ఇటీవల టాక్ షో లతో పాటు ఇతర బ్రాండ్స్ కు ప్రమోషన్స్ కల్పించాలనుకుంటున్నాడు.

Published By: HashtagU Telugu Desk
Nbk107

Nbk107

Balakrishna: నందమూరి హీరో బాలకృష్ణ హైదరాబాద్‌లో బ్రాండ్ ప్రచారం కోసం 3 కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్టు టాక్.  ఇందుకోసం కొన్ని ఫోటో షూట్‌లు కూడా చేశాడు. ఫోటో షూట్‌ల కోసం కేవలం రెండు రోజులు కేటాయిస్తున్నాడు.  పటాన్‌చెరులోని ఓ మాల్ ను ప్రారంభించాల్సి ఉంది. బాలయ్య తన ఇమేజ్ ను ద్రుష్టిలో పెట్టుకొని రూ. 3 కోట్లకు పైగా డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. హీరో బాలయ్య ఇటీవల టాక్ షో లతో పాటు ఇతర బ్రాండ్స్ కు ప్రమోషన్స్ కల్పించాలనుకుంటున్నాడు.

అందులో భాగంగా ఇటీవల ఆభరణాల బ్రాండ్‌ను ప్రమోట్ చేశాడు. అందమైన నటి ప్రగ్యా జైస్వాల్‌తో కలిసి ప్రకటనలో నటించాడు. ‘భగవంత్ కేసరి’తో విజయాన్ని అందుకున్న బాలయ్య యువ దర్శకుడు బాబీతో సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది. హీరో బాలయ్య వరుసగా మూడు హిట్స్ అందుకున్నాడు. ‘అఖండ’ భారీ విజయం తర్వాత బాలయ్య మార్కెట్ పెరిగింది. ఇక బాలకృష్ణ తన కుమారుడు మోక్షజ్ఞను కూడా 2024లో భారీ ఎంటర్‌టైనర్‌తో ఎంట్రీ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నాడు.

Also Read: Konda Surekha: మేడారం జాతరకు నిధులు మంజూరు చేయండి

  Last Updated: 14 Dec 2023, 11:31 AM IST