Big Breaking : అల్లు అర్జున్ అరెస్ట్

Allu Arjun Arrest : మృతురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన పోలీసులు థియేటర్ యజమాని, మేనేజర్, సెక్యూరిటీ మేనేజర్‌లను ఇప్పటికే అరెస్ట్ చేశారు. తాజాగా ఈరోజు శుక్రవారం అల్లు అర్జున్ ను అదుపులోకి తీసుకున్నారు.

Published By: HashtagU Telugu Desk
Allu Arjun Arrest

Allu Arjun Arrest

‘పుష్ప 2’ ప్రీమియర్ షో తొక్కిసలాటలో ఘటన లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిసెంబర్ 04 న ఆర్టీసీ క్రాస్ రోడ్లలోని సంధ్య థియేటర్ ( Sandhya Theatre) వద్ద ‘పుష్ప-2’ ప్రీమియర్ (‘Pushpa-2’ Premiere Show) సందర్భంగా జరిగిన తొక్కిసలాట తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ (Woman Dies)మరణించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హడావుడి కారణంగా తగిన భద్రతా చర్యలు చేపట్టలేకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.

మృతురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన పోలీసులు థియేటర్ యజమాని, మేనేజర్, సెక్యూరిటీ మేనేజర్‌లను ఇప్పటికే అరెస్ట్ చేశారు. తాజాగా ఈరోజు శుక్రవారం అల్లు అర్జున్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన్ను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు.

Read Also : World Chess Championship: ప్రపంచ చెస్ ఛాంపియన్ గా అవతరించిన తెలుగు తేజం దొమ్మరాజు గుకేశ్‌

  Last Updated: 13 Dec 2024, 01:00 PM IST