Disha Refused: విజయ్ కు నో చెప్పిన దిశా పటానీ!

దిశా పటానీ.. బాలీవుడ్ క్రేజీ హీరోయిన్లలో ఒకరు. ఆమె ఫిట్‌నెస్, ఫ్యాషన్ కు ప్రాధాన్యం ఇస్తుంది.

Published By: HashtagU Telugu Desk
Vijay And Disha

Vijay And Disha

దిశా పటానీ.. బాలీవుడ్ క్రేజీ హీరోయిన్లలో ఒకరు. ఆమె ఫిట్‌నెస్, ఫ్యాషన్ కు ప్రాధాన్యం ఇస్తుంది. దిశా లుక్స్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో అభిమానులను అలరిస్తుంటుంది. 2015లో తెలుగు సినిమా, లోఫర్‌తో తన జర్నీని కొనసాగించిది. 2016 బయోపిక్, Ms ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఇక అప్పటి నుంచి ఆమె కోసం వెనుదిరిగి చూసే పరిస్థితి లేదు. దీని తర్వాత, బరేలీలో జన్మించిన నటి ‘భారత్’, ‘బాఘీ 3’, ‘రాధే’ మరియు ‘మలంగ్’ వంటి అనేక విజయవంతమైన చిత్రాలతో ఆకట్టుకుంటుంది.

అయితే పాన్-ఇండియా లైగర్‌లో విజయ్ దేవరకొండ సరసన దిశా కథానాయికగా నటించాల్సి ఉంది. విజయ్ దేవరకొండ సరసన ప్రధాన పాత్రలో నటించమని అడిగారు. కానీ ప్రాజెక్ట్ కు నో చెప్పింది. దీంతో అనన్య పాండేకి వెళ్ళింది. దిశా నో చెప్పడానికి కారణం ఇంకా తెలియలేదు. ప్రస్తుతం దిశా మోహిత్ సూరి దర్శకత్వం వహించిన ‘ఏక్ విలన్ 2’లో కనిపించనుంది. ఇందులో జాన్ అబ్రహం, ఆదిత్య రాయ్ కపూర్, అర్జున్ కపూర్ మరియు తారా సుతారియా కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం జూలై 8, 2022న విడుదల కానుంది.

  Last Updated: 13 Jun 2022, 03:51 PM IST