Site icon HashtagU Telugu

Devara Update: పవర్ ఫుల్ గెటప్ లో ఎన్టీఆర్, దేవర అప్డేట్ ఇదిగో

Devara

Devara

Devara Update: ఈ ఏడాది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసే అత్యంత భారీ చిత్రాల్లో దేవర సినిమా ఒకటి. ఒకవైపు హీరోయిన్ గా జాన్వీ కపూర్, మరోవైపు కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండటంతో భారీ అంచనాలున్నాయి.ఇందులో మొదటి పార్టును వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో జనవరి నుంచే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించాలని చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకుంది.

పవర్‌ఫుల్ యాక్షన్‌తో రూపొందుతోన్న ‘దేవర’ మూవీ నుంచి ఇప్పటికే కొన్ని పోస్టర్లు విడుదల అయ్యాయి. వాటికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ మూవీ నుంచి గ్లింప్స్ వీడియోను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. న్యూ ఇయర్ సందర్భంగా తాజాగా చిత్ర యూనిట్ నుంచి దీనిపై అధికారిక ప్రకటన వెలువడింది.

హై రేంజ్‌లో రూపొందుతోన్న ‘దేవర’ మూవీకి సంబంధించిన గ్లింప్స్ వీడియోను జనవరి 8 విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను సైతం తాజాగా విడుదల చేసింది. ఇందులో ఎన్టీఆర్ సముద్రంపై వేటకు బయలుదేరిన సింగంలా పవర్‌ఫుల్‌ గెటప్‌తో కనిపించాడు. ఈ మూవీ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.