Site icon HashtagU Telugu

Telugu Films: మహేష్ బాబు SSMB 28 నుంచి నాని దసరా వరకు.. Netflixలో రాబోయే 16 తెలుగు చిత్రాలివే..!

List Of Upcoming Telugu Films On Netflix Pr Images

List Of Upcoming Telugu Films On Netflix Pr Images

Netflixలో ఈ ఏడాది రిలీజ్ కాబోయే మూవీస్ లిస్ట్ పెద్దగానే ఉంది.మహేష్ బాబు మూవీ SSMB 28 నుంచి నాని నటించిన దసరా మూవీ, చిరంజీవి యాక్ట్ చేసిన భోళా శంకర్ వరకు 16 తెలుగు సినిమాలు క్యూలో ఉన్నాయి. Netflix ఈ మూవీస్ కు సంబంధించిన స్ట్రీమింగ్ హక్కులను సాధించింది. ఈవిషయాన్ని సంక్రాంతి సందర్బంగా నెట్‌ఫ్లిక్స్ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ఈ మూవీస్ మొదట థియేటర్లలో విడుదల చేయబడి, ఆపై నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంటాయి.  నాని యాక్ట్ చేసిన “దసరా” మూవీ కోసం అభిమానులు ఆతురుతగా ఎదురు చూస్తున్నారు. అతను బొగ్గు గనిలో కూలీగా నటించిన ఈ చిత్రాన్ని.. రామ్ చరణ్ రంగస్థలం, అల్లు అర్జున్  పుష్ప: ది రైజ్ చిత్రాలతో పోలుస్తున్నారు.

2023లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యే చిత్రాల జాబితా

* భోలా శంకర్: అందుబాటులో ఉన్న భాష(లు) తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ

* అమిగోస్:అందుబాటులో ఉన్న భాష(లు) తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ

* మీటర్: అందుబాటులో ఉన్న భాష(లు) తెలుగు

* బుట్ట బొమ్మ: అందుబాటులో ఉన్న భాష(లు) తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ

* బడ్డీ : అందుబాటులో ఉన్న భాష(లు) తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ

* PVT 04: అందుబాటులో ఉన్న భాష(లు) తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ

* టిల్లు స్క్వేర్: అందుబాటులో ఉన్న భాష(లు) తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ

* దసరా: అందుబాటులో ఉన్న భాష(లు) తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ

* ప్రొడక్షన్ నంబర్-6: అందుబాటులో ఉన్న భాష(లు) తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ

* ధమాకా:అందుబాటులో ఉన్న భాష(లు) తెలుగు

* కార్తికేయ 8:అందుబాటులో ఉన్న భాష(లు) తెలుగు

* ప్రొడక్షన్ నెం.14:అందుబాటులో ఉన్న భాష(లు) తెలుగు

* 18 పేజెస్ :అందుబాటులో ఉన్న భాష(లు) తెలుగు

* VT 12:అందుబాటులో ఉన్న భాష(లు) తెలుగు

* విరూపాక్ష:అందుబాటులో ఉన్న భాష(లు) తెలుగు

* SSMB 28:అందుబాటులో ఉన్న భాష(లు) తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ

నెట్‌ఫ్లిక్స్ ప్రకటన ఇదీ..

రాబోయే మూవీస్ లైనప్ గురించి నెట్‌ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ VP మోనికా షెర్గిల్ ఒక ప్రకటన విడుదల చేశారు.“మా ప్రేక్షకులకు భారతదేశం అంతటా స్థానికంగా ప్రామాణికమైన , గ్లోబల్ కథనాల పట్ల విపరీతమైన ఆసక్తి ఉంది. వారు ఇష్టపడే కంటెంట్ ను మరింత అందించాలనుకుంటున్నాము.  డబ్బింగ్ వర్క్, సబ్ టైటిల్స్ కోసం తెర వెనుక మేము చేసే పనితో, ఈ చిత్రాలకు మరింత వ్యాల్యూ పెరుగుతుంది” అని వెల్లడించారు.