డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినా నటి హేమ (Hema )..బెయిల్ పై ఈరోజు విడుదలైంది. బెంగళూరులో గత నెల 20న జరిగిన రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారు. ఈ రేవ్ పార్టీలో పోలీసులకు డ్రగ్స్ కూడా దొరకడంతో.. ఆ పార్టీలో పాల్గొన్న వారి నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. వారిలో 86 మంది బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించారు. వీరిలో నటి హేమకూడా ఒకరు. దీంతో ఆమెను బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేసి జైలు కు తరలించారు. ఈ క్రమంలో ఆమె బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
హేమ వద్ద ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని, అలాగే ఘటన జరిగిన పది రోజులకు వైద్య పరీక్షలు నిర్వహించారని ఆమె తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. అలాగే డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు సాక్ష్యాలు చూపించలేకపోయారని కోర్ట్ కు తెలిపారు. అయితే ఆమె పార్టీలో పాల్గొన్నట్లు చూపే ఆధారాలను సీసీబీ కోర్టుకు అందించింది. దీంతో ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం హేమకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. దీంతో ఈరోజు ఆమె జైలు నుండి బయటకు వచ్చింది. బయటకు వస్తున్న క్రమంలో మీడియా పలు ప్రశ్నలు అడుగగా..ఆమె ఇలాంటి సమాదానాలు చెప్పకుండా వెళ్ళిపోయింది.
ఇదిలా ఉంటె హేమపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కఠిన చర్యలు తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. హేమ విషయమై కమిటీ సభ్యుల అభిప్రాయాలను ‘మా’ అధ్యక్షుడు (Maa President) మంచు విష్ణు కోరగా.. ఆమెను ‘మా’ నుంచి సస్పెండ్ (Suspend) చేయాల్సిందేనని మెజారిటీ మెంబర్స్ అభిప్రాయం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో రేవ్ పార్టీ కేసులో హేమకు క్లీన్ చిట్ వచ్చేంత వరకు ‘మా’ నుంచి ఆమెను సస్పెండ్ చేసేందుకు ‘మా’ అధ్యక్షుడు విష్ణు సిధ్ధమైనట్లు సమాచారం. ఆమె అరెస్ట్ కాకముందు మంచు విష్ణు (Manchu Vishnu) ట్విట్టర్ వేదికగా ‘ఈ కేసులో హేమపై ఆరోపణలు నిరూపితమైతే.. పోలీసులు ఇచ్చిన ఆధారాలకు అనుగుణంగా మా అసోసియేషన్ యాక్షన్ తీసుకుంటుంది’ అని ‘మా’ స్టాండ్‌ని ప్రకటించారు. మరి ఇప్పుడు హేమ బెయిల్ పై బయటకు వచ్చిన క్రమంలో ఆమెతో ఏమైనా మాట్లాడతారా అనేది చూడాలి.
Read Also : Chiru Nagababu: మెగా బ్రదర్స్‌కు రాజ్యసభ..! మోడీ ప్లాన్ అదేనా?