Allu Arjun: అల్లు అర్జున్ ని చూసి బాలీవుడ్ నేర్చుకోవాలి: హేమ

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప ది రూల్ చిత్రంలో నటిస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక ప్రధాన పాత్రలో రూపొందిన పుష్ప ది రైజ్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.

Published By: HashtagU Telugu Desk
Allu Arjun

Allu Arjun

Allu Arjun: టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప ది రూల్ చిత్రంలో నటిస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక ప్రధాన పాత్రలో రూపొందిన పుష్ప ది రైజ్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అంచనాలను మించి వసూళ్లు రాబట్టింది. దీంతో మేకర్స్ పుష్పా2 సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మరోవైపు పుష్పా2 పై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నమోదవడంతో సుకుమార్ ఈ చిత్రాన్ని ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. ప్రస్తుతం పుష్ప ది రూల్ చిత్రీకరణ దశలో ఉంది.

తాజాగా అల్లు అర్జున్ పై బాలీవుడ్ క్వీన్ హేమ మాలిని ఆసక్తికర కామెంట్స్ చేశారు. హేమ మాలిని మాట్లాడుతూ…పుష్ప సినిమా చూశానని, అయితే బన్నీ నటన, అతని గెటప్ నాకెంతగానో నచ్చిందంటూ ప్రశంసించారు.అల్లు అర్జున్ అందగాడు అంటూ ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. సూపర్ స్టార్ పొజిషన్లో ఉండి అల్లు అర్జున్ డీ గ్లామర్ రోల్ పోషించడం ప్రశంసనీయమని ఆమె అన్నారు. అలాంటి గెటప్ లో నటించాలంటే గట్స్ ఉండాలంటూ హేమ అన్నారు.

ఈ ఇంటర్వ్యూలో హేమమాలిని బాలీవుడ్ తారలపై హాట్ కామెంట్ చేశారు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ గెటప్ చూసి బాలీవుడ్ తారలు చాలా నేర్చుకోవాలని ఆమె అన్నారు. హిందీ సినిమా నటులు చాలా తక్కువ మంది మాత్రమే అలా చేస్తారని అన్నారు. ధర్మేంద్ర జీ ఒక సినిమాలో డీ గ్లామర్ లుక్‌లో కనిపించాల్సి వచ్చిందని, అప్పుడు అతను అలాంటి గెటప్ లో నటించడానికి వెనుకాడాడని ఆమె గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం బన్నీకి దేశవ్యాప్తంగా పాపులారీ ఉన్నప్పటికీ ఇలాంటి గెటప్ లో నటించడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసిందంటూ ఆమె అల్లు అర్జున్ పై ఓ రేంజ్ లో ప్రశంసలు కురిపించారు.

Read More: From Actress to Cinematographer: అనుపమ పరమేశ్వరన్ కెమెరా వెనుక కొత్త పాత్ర

  Last Updated: 13 May 2023, 10:57 AM IST