Hebah Patel : ‘మూడ్’ గురించి అడిగేసరికి కుమారికి ఎక్కడో కాలింది..

‘మీ మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో, ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. అందుకే ముందే అడుగుతున్నా. మీతో మాట్లాడొచ్చా అన్న మీనింగ్‌తో మాట్లాడుతున్నా’

  • Written By:
  • Publish Date - October 4, 2023 / 01:52 PM IST

హెబ్బా పటేల్ (Hebah Patel)..కుమారి 21 ఎఫ్ (Kumari 21 F) తో టాలీవుడ్ కు పరిచమైన బ్యూటీ. మొదటి చిత్రంతోనే యూత్ ను కట్టిపడేసింది. మొదటి సినిమా సూపర్ హిట్ కావడం తో అమ్మడికి వరుస ఛాన్సులు తలుపుతట్టాయి. కానీ ఆ రేంజ్లో మాత్రం హిట్స్ పడలేదు. ఈడోరకం, ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా, నాన్న, నేను మంచి సక్సెస్ సాధించినప్పటికీ ఆ తర్వాత చేసిన నా బాయ్ ఫ్రెండ్స్, మిస్టర్, అంధగాడు, ఏంజెల్, 24 కిస్సెస్, ఒరేయ్ బుజ్జిగా వంటి సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఇదే క్రమంలో కొత్త హీరోయిన్ల రాకతో అమ్మడికి ఛాన్సులు తగ్గాయి. ఆ మధ్య ఓదెల రైల్వే స్టేషన్ ఓటీటీ ఫిల్మ్ చేసి.. తన నటనతో మెప్పించింది.

ప్రస్తుతం ద గ్రేట్ ఇండియన్ సూసైడ్ (The Great India Suicide) వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను అలరించేందుకు రాబోతుంది. ఈ నెల అక్టోబర్ 6 ఈ సిరీస్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. మదనపల్లెలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దీన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. హెబ్బాపటేల్ కీలక పాత్ర పోషించగా.. రామ్ కార్తీక్, నరేష్, పవిత్రా లోకేశ్, జయ ప్రకాశ్ తదితరులు మిగిలిన పాత్రలు పోషించారు.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా ఈ సిరీస్ ప్రమోషన్లలో పాల్గొన్న ఈమెకు సదరు యాంకర్ అడిగిన ప్రశ్న ఎక్కడో కాలెలా చేసింది.ఇంతకు ఏ ప్రశ్నకు ఆమె హర్ట్ అయ్యిందంటే..? యాంకర్ ఎలా ఉన్నారు అని అడిగి.. ‘మీ మూడు బాగుందా’ అంటూ ప్రశ్నించాడు. హా ఓకే అన్నాక.. యాంకర్ మరింత ప్రొలాంగ్ చేశాడు. ‘మీ మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో, ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. అందుకే ముందే అడుగుతున్నా. మీతో మాట్లాడొచ్చా అన్న మీనింగ్‌తో మాట్లాడుతున్నా’ అని అడిగాడు. హెబ్బాకు అర్థం కావడంతో..మీరు ఫ్రీగానే ఉన్నారా.. మీ మూడు బాగుందా అని మాత్రమే అడిగానని,అనే సరికి.. మూడ్‌తో కనెక్షన్ ఏముందీ.. ప్రమోషన్ కదా అని ప్రశ్నిస్తూ.. తాను ఇంటర్వ్యూ ఇవ్వాలని అనుకోవడం లేదని సీరియస్‌గా లేచి వెళ్లిపోయింది.ప్రస్తుతం దీనికి సంబదించిన వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.

Read Also : AR Rahman VS Surgeons Association : సర్జన్స్ అసోసియేషన్‌పై రెహమాన్ రూ.10 కోట్ల పరువునష్టం దావా.. ఎందుకు ?