Bigg Boss 6: నామినేషన్స్ లో రచ్చ రచ్చ.. రేవంత్ పై మండిపడిన ఆదిరెడ్డి?

బిగ్ బాస్ సీజన్ 6 చూస్తుండగానే 12 వారాలను విజయవంతంగా పూర్తి చేసుకుని తాజాగా 13వ వారంలోకి ఎంట్రీ ఇచ్చిన

  • Written By:
  • Publish Date - November 28, 2022 / 04:07 PM IST

బిగ్ బాస్ సీజన్ 6 చూస్తుండగానే 12 వారాలను విజయవంతంగా పూర్తి చేసుకుని తాజాగా 13వ వారంలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. 12వ వారం ఎలిమినేషన్స్ లో భాగంగా రాజ్ ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లిపోయాడు. ఇది ఇలా ఉంటే అప్పుడే 13వ వారం మొదలవడంతో హౌస్ లో నామినేషన్ ప్రక్రియ మొదలయ్యింది. ఇక తాజాగా బిగ్ బాస్ ప్రోమోని విడుదల చేశారు. అయితే నిన్నటి వరకు ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ ఎంట్రీ ఇవ్వడంతో సంతోషంగా గడిపిన హౌస్ మేట్స్ ఆ తర్వాత రాజ్ ఎలిమినేట్ అవ్వడంతో పలువురు ఎమోషనల్ అయ్యారు. తాజాగా సోమవారం బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా హౌస్ లో రచ్చ రచ్చ అయ్యింది.

ఈ క్రమంలోనే ఆదిరెడ్డి, రేవంత్ పై మండిపడ్డాడు. ఆ తర్వాత శ్రీహాన్ ఆదిరెడ్డికి తగిన విధంగా బుద్ధి చెప్పి నోరు మూయించాడు. మొదట్లో బాగానే ఉన్నప్పటికీ వారాలు గడుస్తున్న కొద్దీ ఆది రెడ్డి రేవంత్ ల మధ్య ఫైట్ నడుస్తోంది. కొన్ని వారాలుగా పరోక్షంగా యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. మరి ముఖ్యంగా ఫిజికల్ టాస్కులు రాగానే ఇద్దరు శత్రువుల అయిపోతారు. తాజాగా నామినేషన్స్ లో భాగంగా రేవంత్ స్ట్రాటజీని ఆదిరెడ్డి ప్రశ్నించాడు. అప్పుడు రేవంత్‌ నన్ను కావాలనే బ్యాడ్‌ చేస్తున్నావు అనగా వెంటనే ఆదిరెడ్డి వీడియో చూపిస్తే వెళ్లిపోతా అంటూ ఆదిరెడ్డి ఛాలెంజ్‌ చేశాడు. ఆ వీడియో చూపించారు.. నాగ్‌ అతని పై సీరియస్ కూడా అయ్యాడు. అయితే ఇప్పుడు నామినేషన్స్ లో మళ్లీ అదే వాదన వచ్చింది.

ఆ వీడియోకి ముందు జరిగినది వాళ్లు చూపించలేదు.. అది చూపిస్తే తెలుస్తుంది. అయినా నీ మనస్సాక్షికి తెలియదా అంటూ ప్రశ్నిస్తాడు ఆది రెడ్డి. అందుకు రేవంత్‌ నాకు చూపించిన వీడియోకి సంబంధించే స్టాండ్‌ తీసుకుంటాను అని తెలిపాడు. అలా ఇద్దరూ కొద్దిసేపు వాదించుకున్నారు. అప్పుడు రేవంత్ కోపం వచ్చి నామినేషన్ చేసి వెళ్లిపో అనగానే ఎక్కడికి వెళ్ళేది నీకు వినాలని లేకపోతే లోపలికి వెళ్లి సోఫాలో కూర్చో అంటూ ఆది రెడ్డి ఫైర్ అయ్యాడు. ఇక్కడ ఎవడు భయపడడు అంటూ రేవంత్ పై రెచ్చిపోయి మాట్లాడాడు అది రెడ్డి. అనంతరం శ్రీహాన్ ఆదిరెడ్డిని నామినేట్ చేస్తుండగా ఆదిరెడ్డి రివర్స్ లో శ్రీహన్ పై ఫైర్ అయ్యాడు.