Site icon HashtagU Telugu

Vijayakanth Passed Away: ప్రముఖ నటుడు విజయ్‌కాంత్‌ కన్నుమూత

Vijayakanth Passed Away

Safeimagekit Resized Img (2) 11zon

Vijayakanth Passed Away: ప్రముఖ నటుడు విజయ్ కాంత్ (71) (Vijayakanth Passed Away) కన్నుమూశారు. కరోనా బారిన పడిన ఆయన చెన్నై ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. అంతకముందు ప్రముఖ తమిళ నటుడు విజయ్‌కాంత్ కరోనా బారిన పడ్డారని డీఎండీకే పార్టీ వర్గాలు వెల్లడించాయి. ‘విజయ్‌కాంత్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోంది’ అని ఆ పార్టీ తెలిపింది. ఇంతలోనే ఆయన కన్నుమూయడంతో పార్టీ వర్గాలు, అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో చెన్నైలోని మియోట్ ఆసుపత్రిలో చేరిన ఆయ‌న‌కు కరోనా సోకినట్లు నిర్ధారించారు.

Also Read: Madhya Pradesh Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. బస్సులో మంటలు, 13 మంది సజీవ దహనం

‘ఇనిక్కుం ఇలామై’తో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు విజయ్‌కాంత్‌. సుమారు 100కి పైగా చిత్రాల్లో ఆయన నటించి ఎన్నో ఏళ్లపాటు ప్రేక్షకుల్ని అలరించారు. విజయ్‌కాంత్‌ 100వ చిత్రం ‘కెప్టెన్‌ ప్రభాకర్‌’ విజయం సాధించిన తర్వాత నుంచి అందరూ ఆయన్ని కెప్టెన్‌గా పిలుస్తున్నారు. విజయ్‌కాంత్ నటించిన చాలా చిత్రాలు తెలుగులోనూ డబ్‌ అయ్యాయి. ప్రజలకు సేవల చేయాలనే ఉద్దేశంతో 2005లో డీఎండీకే పార్టీని స్థాపించారు.

We’re now on WhatsApp. Click to Join.

నటుడు విజయ్ కాంత్ 1952లో ఆగస్టు 25న మధురైలో కె.ఎన్.అలగర్ స్వామి, ఆండాళ్ అజగరాస్వామి దంపతులకు జన్మించారు. 1990 జనవరి 31న ప్రేమలతను ఆయన వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వారి పేర్లు విజయ్ ప్రభాకర్, షణ్ముగ పాండ్యన్. వారి రెండో కుమారుడు షణ్ముగ 2014లో ‘సగప్తాహం’ సినిమా ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.