Johnny Master : జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్‌పై విచారణను రంగారెడ్డి జిల్లా ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక పోక్సో కోర్టు అక్టోబర్ 7కి వాయిదా వేసింది. అత్యాచారం ఆరోపణల కేసులో జానీ మాస్టర్ (Johnny Master) ను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. జానీ మాస్టర్ గత కొంతకాలంగా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు పిర్యాదు చేసిన నేపథ్యంలో జానీని అరెస్ట్ చేసి కోర్ట్ లో హాజరు పరచగా..14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో బెయిల్ కోసం జానీ కోర్ట్ ను ఆశ్రయించారు.
జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్‌పై విచారణను రంగారెడ్డి జిల్లా కోర్టు వచ్చే నెల (అక్టోబర్) 7వ తేదీకి వాయిదా వేసింది. నిందితుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై నార్సింగి పోలీసులు… రంగారెడ్డి జిల్లా ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక పోక్సో కోర్టులో కౌంటర్ కూడా దాఖలు చేశారు. జానీ మాస్టర్‌కు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని కౌంటర్‌లో పోలీసులు పేర్కొన్నారు. విచారణ సమయంలో బెయిల్ ఇవ్వవద్దని కోర్టును కోరారు. ఈరోజు విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణను వాయిదా వేసింది. ఇప్పటికే జానీ పోలీసులకు కీలక విషయాలు రాబట్టారు. ఇలాంటి సమయంలో బెయిల్ ఇవ్వవద్దని కోర్టును కోరినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 4 వరకూ జానీ మాస్టర్ కి రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. మళ్లీ ఆ తేదీన జానీని కోర్టులో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.
Read Also : Musi Victims : ‘మా ఇల్లు ఇక్కడే మా జీవితాలు ఇక్కడే’- మూసి బాధితుల ఆందోళన