Site icon HashtagU Telugu

Krishna in ICU: ఐసీయూలో కృష్ణ.. ఆరోగ్యం మరింత విషమం!

Krishna

Krishna

సూపర్‌స్టార్‌ కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై గచ్చిబౌలి కాంటినెంటల్‌ ఆస్పత్రి వైద్యులు హెల్త్‌ బులిటెన్ విడుదల చేశారు. ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. ‘‘కార్డియాక్‌ ఆరెస్టుతో కృష్ణను ఆస్పత్రికి తీసుకొచ్చారు. కార్డియాలజిస్టుల బృందం ప్రత్యేక పర్యవేక్షణ చేస్తోంది. కృష్ణకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్నాం. 24గంటల వరకు ఏమీ చెప్పలేం. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారు. ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు మరోసారి హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేస్తాం’’ అని వైద్యులు తెలిపారు.

ప్రస్తుతం కృష్ణ నానక్ రామ్ గూడలో నరేశ్ వద్ద ఉంటున్నారు. ఇదే ఇంట్లో విజయనిర్మలతో కలసి కృష్ణ ఉండేవారు. అప్పుడప్పుడు మహేశ్ బాబు తన తండ్రి వద్దకు వెళ్లి వస్తున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో కృష్ణ కుమారుడు మహేశ్ బాబు, ఆయన కుమార్తెలు, నరేశ్ ఉన్నారు. ఇటీవలి కాలంలో ఆయన తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారు. ఇటీవలే ఆయన భార్య కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీనికి ముందు ఆయన కుమారుడు రమేశ్ బాబు మరణించారు. ఈ పరిణామాలతో ఆయన తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. అంతకు ముందు ఆయన రెండో భార్య విజయనిర్మల కన్నుమూశారు.