Bigg Boss Winner: ‘బిగ్ బాస్ సీజన్ 6’ విన్నర్ అతడే!

తెలుగు బిగ్ బాస్ (Bigg boss) సీజన్ 6 ఎండింగ్ కు చేరుకుంది. విజేత ఎవరో దాదాపుగా తెలిసిపోయింది

Published By: HashtagU Telugu Desk
Bigg Boss winner

Bigg Boss

రియాల్టీ షోలు (Bigg Boss) తెలుగు ఫ్యాన్స్ కు చెప్పలేనంత ఇష్టం. ఎంటర్ టైన్ మెంట్ లో  బిగ్ బాస్ దే మొదటిస్థానం. హౌజ్ లోపల జరిగే విషయాలు ఏమైనప్పటకీ, ఫుల్ ఎంటర్ టైన్ అందించడంలో మాత్రం ముందుంటోంది. తాజాగా ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 6’ ఎండింగ్ కు చేరుకుంది. అయితే కార్యక్రమం ప్రారంభంలో బోర్ గా సాగినప్పటికీ ఆ తర్వాత అనేక ట్విస్ట్ లతో ఫ్యాన్స్ ఆకట్టుకుంటోంది. విభేదాలు, స్నేహాలు, ప్రేమ, రొమాన్స్ లాంటివి బిగ్ బాస్ తెలుగు 6ని సరదాగా మార్చాయి. అయితే శ్రీ సత్య ఎలిమినేషన్ తర్వాత ఇప్పుడు పోటీలో కేవలం 5 మంది పోటీదారులు మాత్రమే మిగిలారు.  ముఖ్యంగా ఎల్‌వి రేవంత్ (టాలీవుడ్ సింగర్), రోహిత్ సాహ్ని, ఆది రెడ్డి, శ్రీహన్ కీర్తి భట్ పోటీలో నిలిచారు.

వివాదాస్పద రియాలిటీ షో (Bigg Boss) కి రేపు చివరి రోజు అని మనందరికీ తెలుసు. ఈ ఏడాది విలువైన ట్రోఫీని ఏ లక్కీ కంటెస్టెంట్ ఎగురవేస్తాడో తెలుసుకోవడానికి అభిమానులు ఎంతో ఆసక్తితో ఉన్నారు. విజేత పేరు తెలుసుకోవాలనే ఆసక్తి ప్రస్తుతం ప్రతిఒక్కరిలో ఉంది. షోకి సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ సోర్సెస్ ప్రకారం..  ఈ షోలో ఎల్‌వి రేవంత్ (Singer Revanth) గెలవబోతున్నారని టాక్. ఈ సింగర్ ‘బిగ్ బాస్ తెలుగు 6’ ట్రోఫీని గెలుచుకుంటారని తెలుస్తోంది. అయితే శ్రీహాన్ ఓట్ల పరంగా రేవంత్‌ కు పోటీ ఇస్తున్నాడు.

ప్రేక్షకులు కూడా రేవంత్ వైపు మొగ్గు చూపుతున్నారు. “షో గెలవడానికి అర్హత ఉన్న కంటెస్టెంట్ రేవంత్ మాత్రమే ” అని నమ్ముతారు. రేవంత్ ప్రస్తుతం హైప్ ఉన్న సెలబ్రిటీలలో ఒకడు. తన ఛాలెంజ్స్, టాస్క్ తో  భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నాడు. మొదటి రోజు నుండే యాక్టివ్ గా బిగ్ బాస్ టాస్క్ ను కంప్లీట్ చేస్తున్నాడు. ప్రదర్శనకు మంచి కంటెంట్‌ను అందిస్తున్నాడు. అద్భుతమైన రీతిలో దూసుకుపోతున్న రేవంత్ (Singer Revanth) వైపే మొగ్గు చూపుతున్నారు ఫ్యాన్స్.

Also Read: Don KTR: డాన్ కేటీఆర్.. చక్కర్లు కొడుతున్న ఓల్డ్ పిక్

  Last Updated: 17 Dec 2022, 02:03 PM IST