Site icon HashtagU Telugu

Ileana Reveals: అతడే నా రసహ్య ప్రియుడు, ఇలియానా ఇన్ స్టా పోస్ట్ వైరల్

Ilena

Ilena

నటి ఇలియానా గర్భం దాల్చిన విషయం అందరికీ తెలిసిందే. పోకిరీ, దేవదాసు లాంటి సినిమాలతో ఆకట్టుకున్న ఈబ్యూటీ గతకొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. కొన్ని నెలల క్రితం తాను గర్భం దాల్చినట్లు సోషల్ మీడియాలో తెలియజేసింది. అయితే ఇలియానా ప్రియుడు ఎవరు అనేది సీక్రెట్ గా ఉంది. ఈ నేపథ్యంలో నటి ఇలియానా ఎట్టకేలకు ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఆమె లైఫ్ లో మిస్టరీ మ్యాన్’ కు సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది. అయితే ఇలియానా ప్రెగ్నెన్నీ కారణమైన వ్యక్తి ఎవరో తెలియక అటు ఫిల్మ్ వర్గాలు, ఇటు ప్రేక్షకులు అనేక సందేహాలు వ్యక్తం చేశారు. దీంతో ఇలియానా తన ప్రియుడికి సంబంధించిన ఫొటోలను బయటపెట్టింది.

ఫొటోల్లో ఇలియానా ప్రెగ్నెన్సీ గ్లోలో ప్రకాశవంతంగా కనిపిస్తుండగా, ఆమె ప్రియుడు నల్ల చొక్కాలో ఆమె అందగత్తె అందమైన గడ్డంతో కనిపించాడు. అంతకుముందు ఇలియానా తన భాగస్వామి అస్పష్టమైన ఫోటోతో మకతిక పెట్టింది. తన ప్రియుడి పేరు, వివరాలను గోప్యంగా ఉంచి అనేక అనుమానాలకు తావిచ్చింది. కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్‌తో ఇలియానా డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ వినిపించాయి. ఇలియానా లేటెస్ట్ పోస్ట్ తో ఆమె ప్రియుడు ఎవరు అనేది తెలిసిపోయింది.

Also Read: Telangana Assembly: త్వరలో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు, ఎన్నికలే లక్ష్యంగా పార్టీల అస్త్రాలు!