Site icon HashtagU Telugu

Rashmika Mandanna: ఆ హీరోనే నా ప్రేమికుడు: ఫ్యాన్స్ చిట్ చాట్ లో రష్మిక మందన్న

Rashmika And Thalapathy

Rashmika And Thalapathy

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత డిమాండ్ ఉన్న నటీమణులలో రష్మిక మందన్న ఒకరు. నటి అనేక హిట్ చిత్రాలలో నటించి తానేంటో నిరూపించుకుంది. తమిళ చిత్ర పరిశ్రమతో పాటు, ఇటీవలే సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటించిన ‘మిషన్ మజ్ను’తో రష్మిక  బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అమితాబ్ బచ్చన్‌లతో కలిసి ‘గుడ్‌బై’లో కూడా కనిపించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రష్మిక మరోసారి ట్విట్టర్ వేదికగా అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యింది.

రష్మిక ట్విట్టర్‌లోకి వెళ్లి, “హాయ్ లవర్స్.. నేను మీ ట్వీట్లు, కామెంట్స్ చదివాను. మీలో ప్రతి ఒక్కరిపై ప్రేమతో నా హృదయం నిండిపోయింది. నేను మీ అందరినీ చాలా మిస్ అయ్యాను.. కాబట్టి ఈ రోజు కొంచెం చాట్ చేద్దామా? #RushHour అంటూ చాటింగ్ చేసింది. ఒక అభిమాని మాత్రం రష్మిక తమిళ్ సూపర్ స్టార్ విజయ్ చేతిని పట్టుకుని ఫొటోను పోస్ట్ చేశాడు. ఈ ఫోటోను షేర్ చేసిన అభిమాని విజయ్ గురించి ఒక్క మాటలో చెప్పండి అని అడగ్గా.. వెంటనే రష్మిక ఆయన నా “లవ్” అని సమాధానం ఇచ్చింది.

తనతో నటించే అవకాశం వస్తే మరో సినిమా చేసేందుకు రెడీ అని బదులిచ్చింది. హీ ఈజ్ సో స్పెషల్ అని కూడా చెప్పింది. ఇక రష్మికతో ‘సామి-సామి’ స్టెప్పులు వేయాలని అభిమానులు రిక్వెస్ట్ చేశారు. రష్మిక చమత్కారంగా సమాధానమిస్తూ, “నేను సామి సామి స్టెప్ చాలా సార్లు చేసాను.. ఇప్పుడు నా వెన్నులో సమస్యలు వస్తాయని నాకు అనిపిస్తోంది’’ సెటైర్స్ వేసింది. అయితే ఈ బ్యూటీ టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండతో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్మిక తమిళ్ విజయ్ పై మనసు పారేసుకోవడం ఏంటనీ విజయ్ దేవరకొండ అభిమానులు షాక్ అయ్యారు.

Exit mobile version