Site icon HashtagU Telugu

Dimple Hayathi: వల్గర్ అంటారేంటి? : డింపుల్

Dimple Hayathi

New Web Story Copy (47)

Dimple Hayathi: గోపీచంద్, డింపుల్ హయతి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం రామబాణం. శ్రీవాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ప్రమోషన్స్ మొదలు పెట్టింది చిత్ర బృందం. ఈ రోజు హైదరాబాద్ లోని ప్రముఖ హోటల్ లో రామబాణం చిత్ర యూనిట్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ మీట్ లో ఓ విలేఖరి హీరోయిన్ డింపుల్ కు కోపం తెప్పించారు. వల్గర్ అంటావేంటి అంటూ డింపుల్ ఆ విలేకరిపై మండిపడింది.

ఖిలాడీ ఫేమ్ డింపుల్ హయతి తెలుగు ప్రేక్షలకు పరిచయం అక్కర్లేని పేరు. రవితేజ సినిమాలో నటించి అందర్నీ ఆకర్షించింది. సినిమా సరిగా అడనప్పటికీ డింపుల్ అందం అందర్నీ ఆకర్షించింది. ఇక ప్రస్తుతం డింపుల్ హీరోయిన్ గా గోపీచంద్ హీరోగా రామబాణం సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకి శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను మే 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ప్రస్తుతం ప్రమోషన్స్ లో భాగంగా ఈ రోజు రామబాణం టీమ్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సినిమాలో మీరు కొంచెం వల్గర్ గా కనిపిస్తున్నారు. మీ క్యారెక్టర్ ఈ సినిమాలో ఎలా ఉండబోతుంది అంటూ ఓ విలేకరి ప్రశ్నించారు. దానికి డింపుల్ సమాధానమిస్తూ.. వల్గర్ అని మాట్లాడుతారేంటి? ఈ సినిమాలో అలాంటిదేం లేదు. ఇప్పటికే విడుదలైన క్లిప్స్ లో చాలా శుభ్రంగా ఉన్నాను. సినిమా కూడా అంతే శుభ్రంగా ఉంటుంది అంటూ అసహనం వ్యక్తం చేసింది. అదే సయమంలో దర్శకుడు మైక్ తీసుకుని ఘాటుగా స్పందించాడు. ఈ ప్రెస్ మీట్లో ఆమె వేసుకున్న డ్రెస్ ఎంత ట్రెడిషనల్ గా ఉందో సినిమా కూడా అంతే అందంగా ఉంటుంది. ఇది ఫామిలీ ఓరియంటెడ్ సినిమా అంటూ ఘాటుగా రిప్లయ్ ఇచ్చాడు.

Read More: Samantha: సమంత కోసం ఏకంగా గుడి కట్టించిన అభిమాని.. ఎక్కడో తెలుసా?

Exit mobile version