Mega156: మెగాస్టార్ 156 పోస్టర్ చూశారా.. హైప్ క్రియేట్ చేస్తున్న ఫస్ట్ లుక్

మెగాస్టార్ ప్రస్తుతం తన 156వ చిత్రాన్ని యువ దర్శకుడు మల్లిడి వశిష్ట దర్శకత్వంలో చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Published By: HashtagU Telugu Desk
Mega156

Mega156

Mega156: ఇటీవలే మెహర్ రమేష్ భోళా శంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఫ్లాప్‌ను ఎదుర్కొన్నాడు. దీంతో మెగాస్టార్ ఇప్పుడు కథల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్త పడుతున్నాడు. మెగాస్టార్ ప్రస్తుతం తన 156వ చిత్రాన్ని యువ దర్శకుడు మల్లిడి వశిష్ట దర్శకత్వంలో చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే అధికారిక ప్రకటన వెలువడగా, ఈరోజు దసరా పండుగ సందర్భంగా భారీ అధికారిక పూజా కార్యక్రమాలతో చిత్రాన్ని లాంచ్ చేశారు.

కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఛోటా కె నాయుడు ఛాయాగ్రహణం అందిస్తుండగా, దర్శకుడు వశిష్ట సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అతి త్వరలో ప్రారంభం కానుందని, హీరోయిన్లు, ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు. కాగా, ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్‌లు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

Also Read: 7 Killed: ప్రాణాలు తీసిన పొగమంచు, యూఎస్ లో 7 దుర్మరణం

  Last Updated: 24 Oct 2023, 12:38 PM IST