Samantha Ruth Prabhu: సమంత వర్కౌట్ వీడియోను చూశారా.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే

టాలీవుడ్ నటి సమంత అద్భుతమైన నటి మాత్రమే కాదు.. మంచి ఫిట్ నెస్ ప్రియురాలు కూడా.

  • Written By:
  • Publish Date - November 25, 2023 / 04:43 PM IST

Samantha Ruth Prabhu: టాలీవుడ్ నటి సమంత అద్భుతమైన నటి మాత్రమే కాదు.. మంచి ఫిట్ నెస్ ప్రియురాలు కూడా. ఆమెకు ఏమాత్రం సమయం దొరికినా జిమ్ లోనూ వర్కవుట్స్ చేస్తూ, ఏదైనా ఆశ్రమంలో యోగా చేస్తూ అభిమానులకు టచ్ లోకి ఉంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ వర్కౌట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శారీరిక ఆరోగ్యం పట్ల సమంత రూత్ ప్రభు ప్రత్యేక దృష్టి పెడుతుంది. ఈ వీడియో సమంతకు వ్యాయామం పట్ల ఉన్న ఆసక్తిని తెలియజేస్తోంది.

ఈ వీడియోలో సమంతా రోలర్ వర్కౌట్‌తో కనిపిస్తుంది. కండరాలను సరిగ్గా వుంచుకునేందుకు ఈ వర్కౌట్ బాగా పనిచేస్తుందట. ఈ వ్యాయామం బలం, శరీర సమతుల్యతను పూర్తిగా మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అయితే సినిమాల విషయానికి వస్తే సమంత ఈ ఏడాదిలో శాకుంతలం, ఖుషి అంటూ ఇలా బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. కానీ శాకుంతలం డిజాస్టర్ అయింది. ఖుషి మంచి ఫలితాన్నే రాబట్టుకుంది. ఈ ఏడాదిలో సమంతకు ప్రశంసలు బాగానే వచ్చాయి. ఖుషి తర్వాత సినిమాలకు బ్రేక్ ప్రకటించిన సమంత నెక్ట్స్ ఏ సినిమాలో నటిస్తుందోనని అభిమానుల్లో క్యూరియాసిటీ నెలకొంది. అయితే సమంత ఓ బాలీవుడ్ మూవీకి సైన్ చేసినట్టు వార్తలు వినిపిస్తుండటం గమనార్హం.

కాగా మరోవైపు రెండో పెళ్లి చేసుకుని .. లైఫ్‌లో సంతోషంగా ఉండాలని ఆమె తల్లిదండ్రులు సమంతను ఒత్తిడి చేస్తున్నప్పటికీ ఆమె దీనికి అంగీకరించడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. సమంతకు మళ్లీ పెళ్లీ చేసుకోవాలనే ఆలోచన లేదట.ఒకసారి పెళ్లి చేసుకుని మోసపోయానని.. మరోసారి అలాంటి తప్పు జరగనివ్వనని సమంత తన ఫ్యామిలీకి చెబుతున్నారట. ఇకపై ఒంటరి జీవితాన్ని సాగించడానికే సమంత ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.