Site icon HashtagU Telugu

Manchu Laxmi Home Tour: మంచు లక్ష్మీ ఖరీదైన ఇల్లును చూశారా..!

Manchu Laxmi

Manchu Laxmi

తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటీనటుల్లో మంచు లక్ష్మీ ప్రసన్న (Manchu Laxmi) ఒకరు. ఆమె నటి మాత్రమే కాదు.. నిర్మాత కూడా. పలు టెలివిజన్ కార్యక్రమాలకు హోస్ట్ గా కూడా పనిచేసింది. ఈ మంచు బ్యూటీ 2011లో అనగనగా ఓ ధీరుడు సినిమాతో టాలీవుడ్‌  (Tollywood) లోకి అడుగుపెట్టింది. 2012లో ఫిల్మ్ డిపార్ట్‌మెంట్‌లో బాలీవుడ్ అరంగేట్రం చేసింది. టాలీవుడ్ నటులు మంచు విష్ణు, మంచు మనోజ్‌లకు అక్క. అయితే లక్ష్మి మంచు (Manchu Laxmi) ఒక సంవత్సరం క్రితం సొంతంగా యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించింది.

తన హోమ్ టూరుకు సంబంధించిన విశేషాలతో కూడిన వీడియోను పోస్ట్ చేసింది. దీనికి 8 మిలియన్ల వీక్షణలు వచ్చాయి. హైదరాబాద్ లోని ఉంటున్న ఖరీదైన ఇంటిని ఆరేళ్ల క్రితం ఆమె తండ్రి మోహన్ బాబు గిఫ్ట్ గా ఇచ్చారు. విశాలమైన గదులు, అత్యాధునిక సౌకర్యలతో కూడిన ఇల్లు ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంటోంది. పురాతన వస్తువులతో కూడిన గదులు, పెద్ద పెద్ద వార్డ్ రోబ్, ఖరీదైన కిచెన్, పిల్లలకు ప్రత్యేక గదులు.. ఇలా చెప్పుకుంటు పోతే ఎన్నో సౌకర్యాలున్నాయి. మంచు లక్ష్మీ (Manchu Laxmi) హోం టూర్ వీడియో చూడాలనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో పై ఓ లుక్ వేయ్యండి మరి.

Also Read: Suhas Exclusive: శభాష్ సుహాస్.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి హీరో దాకా!