బాలీవుడ్ (Bollywood) హీరోల్లో హృతిక్ రోషన్ (Hrithik Roshan) స్టైల్ వేరుగా ఉంటుంది. ఇక ఆయన బాడీ బిల్డింగ్ కూడా ఇతర హీరోలకు భిన్నంగా ఉంటుంది. సల్మాన్ ఖాన్ కు కండల వీరుడు అని పేరు ఉన్నప్పటికీ, బాడీని బిల్డ్ చేయడంలో మాత్రం హృతిక్ (Hrithik Roshan) ముందుంటాడని చెప్పక తప్పదు. కొత్త సంవత్సరం వేళ తన బాడీని ప్రదర్శించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో తన లుక్ ను షేర్ చేశాడు. తన ఎయిట్-ప్యాక్ బాడీలో కండలు తేలి ఉన్నాడు. 8 ప్యాక్స్ బాడీతో జిమ్ లో కెమెరాకు ఫొజు ఇచ్చాడు.
పోస్ట్‌ను షేర్ చేస్తూ ఈ హీరో “సరే. వెళ్దాం. #2023” అని క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం హృతిక్ రోషన్ (Hrithik Roshan) దీపికా పదుకొనేతో తన తదుపరి చిత్రం ‘ఫైటర్’ లో నటిస్తున్నాడు. ఈ మూవీ కోసం తన బాడీని బిల్డ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. గత సంవత్సరం, హృతిక్, దీపికా ఈ చిత్రం షూటింగ్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం హృతిక్ 8 ప్యాక్ బాడీ సోషల్ మీడియాలో వైరల్ (Viral) అవుతోంది.
Also Read : Vijay and Rashmika: మల్దీవ్స్ లో రచ్చ రచ్చ చేసిన జంట.. పిక్స్ వైరల్!