టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత (Samantha) త్వరలో రెండో వివాహం ( 2nd Wedding) చేసుకోబోతున్నారనే వార్తలు సినిమా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఆమె మొదట 2010లో “ఏ మాయ చేశావే” సినిమాతో నాగచైతన్యను కలవడం, ఆ పరిచయం ప్రేమగా మారి 2017లో వివాహం వరకు వెళ్లడం తెలిసిందే. కానీ 2021లో వ్యక్తిగత కారణాలతో వీరిద్దరూ విడిపోవడం జరిగింది. అప్పటి నుంచి సమంత వ్యక్తిగత జీవితం, ఆరోగ్య పరిస్థితులు అభిమానుల్లో ఆందోళన కలిగించాయి. అయితే తాజాగా ఆమె ప్రేమలో మళ్ళీ పడ్డారన్న వార్తలు ముఖ్యంగా రాజ్ నిడుమోరుతో పెళ్లి చేసుకోబోతున్నారన్న అంశం అభిమానుల్లో సంతోషాన్ని కలిగిస్తోంది.
Terror Attack Effect : పాకిస్థాన్ కు భారత్ భారీ దెబ్బ?
‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్‌కు దర్శకత్వం వహించిన రాజ్ నిడుమోరు(Raj Nidimoru)తో సమంత డేటింగ్‌లో ఉన్నారని, తిరుమలయాత్రతో ఈ విషయం మరింత స్పష్టమైందని టాక్. ఇప్పటికే వీరి పెళ్లి జరగాల్సి ఉన్నప్పటికీ, నాగచైతన్యతో విడాకుల అంశం కోర్టులో ఉండటం వల్ల పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. ఇక వచ్చే రెండు నెలల్లో ఆ అంశం పూర్తవుతుందని, వెంటనే వీరిద్దరి వివాహాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక రాజ్ నిడుమోరు సమంత అనారోగ్యంగా ఉన్న సమయంలో చూపిన స్నేహం, శ్రద్ధ ఆమె మనసును కదిలించిందట. దీంతో సమంతే మొదటగా రాజ్‌కు ప్రేమను వ్యక్తపరిచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు సమంత నిర్మాతగా వ్యవహరించిన “శుభమ్” అనే చిత్రం మే 9న విడుదల కానుండడంతో, ఇది ఆమె వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితం రెండింటికీ కొత్త శుభారంభమవుతుందని అభిమానులు భావిస్తున్నారు. మరి నిజంగా సమంత రెండో పెళ్లి చేసుకుంటుందా లేదా అనేది చూడాలి.