Pooja Hegde : బుట్ట బొమ్మ పూజా హెగ్దే ప్రేమలో పడిందా.. త్వరలోనే పెళ్లి చేసుకుంటుందా అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. తెలుగులో స్టార్ క్రేజ్ దక్కించుకున్న అమ్మడు బాలీవుడ్ లో హిట్ కోసం ఎంత ప్రయత్నిస్తున్నా వర్క్ అవుట్ అవ్వట్లేదు. రీసెంట్ గా సల్మాన్ ఖాన్ తో సినిమా పై చాలా హోప్స్ పెట్టుకున్నా అది కూడా వర్క్ అవుట్ కాలేదు. తెలుగులో మహేష్ గుంటూరు కారం సినిమాలో ఛాన్స్ వచ్చినట్టే వచ్చి చేజారింది. ఫైనల్ గా ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం సంప్రదించారని టాక్.
తెలుగులో రవితేజ, నాని సినిమాల్లో నటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుండగా సడెన్ గా పూజా హెగ్దే ప్రేమలో ఉందన్న వార్త వైరల్ గా మారింది. సినిమాల్లో బిజీగా ఉన్న అమ్మడికి ప్రేమించే తీరిక ఎక్కడిదని అనుకుంటున్నారు. కానీ దేనికి ఉండే టైం దానికి ఉంటుంది. ఇంతకీ పూజా బేబీ ఎవరి ప్రేమలో పడింది. ఎవరా లక్కీ గాయ్ అంటే ఓ క్రికెటర్ ప్రేమలో పూజా హెగ్దే పడిందని అంటున్నారు.
అతని పేరు బయటకు రావట్లేదు కానీ అతనితో పూజా (Pooja Hegde) క్లోజ్ గా ఉంటుందని త్వరలోనే అతనితో పెళ్లి అనౌన్స్ మెంట్ వస్తుందని అంటున్నారు. తెలుగులో పాపులర్ హీరోయిన్ అయిన పూజా హెగ్దే ఈమధ్య ఇక్కడ కూడా ఛాన్స్ లు మిస్ చేసుకుంటుంది. కెరీర్ కొద్దిగా గ్యాప్ వచ్చినా తిరిగి ఫాం లోకి రావాలని ప్రయత్నిస్తుంది పూజా.
అయితే ఈలోగా అమ్మడు ప్రేమలో ఉందని వార్తలు రావడం ఆమె ఫ్యాన్స్ ని షాక్ అయ్యేలా చేస్తుంది. పూజా నిజంగానే ప్రేమలో ఉందా పెళ్లిపై వస్తున్న వార్తలపై పూజా ఏవిధంగా రెస్పాండ్ అవుతుంది అన్నది త్వరలో తెలుస్తుంది.
Also Read : Ganesh Laddu గణేష్ లడ్డూ కొట్టేసిన స్కూల్ పిల్లలు.. వీడియో వైరల్..!