Site icon HashtagU Telugu

Mahesh Babu: దుబాయ్ లో మహేష్ విలాసవంతమైన విల్లా

Super Star Mahesh Babu

Mahesh Babu

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస సినిమాలతో బిజిబిజిగా గడుపుతున్నాడు. ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ గ్లిమ్ప్స్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండటంతో సినిమా బ్యాక్రౌండ్ మ్యూజిక్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.

కాస్త టైం దొరికితే కుటుంబసమేతంగా విదేశాలకు చెక్కేస్తారు మహేష్ బాబు. ఇటీవల మహేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఫారెన్ ట్రిప్ వేశాడు. జర్మనీ, ఫ్యారిస్ హాలిడే ట్రిప్ వెళ్ళాడు. ఇక తాజాగా మహేష్ దుబాయ్ చెక్కేశాడు. ఓ వైపు షూటింగ్ మరోవైపు దుబాయ్ ట్రిప్ కాస్త ఆలోచించాల్సిన విషయమే. అయితే మహేష్ దుబాయ్ ట్రిప్ కి ఓ రీజన్ ఉందట. అందుకోసమే మహేష్ దుబాయ్ కి వెళ్లాడని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

మహేష్ దుబాయ్ లో ఖరీదైన విల్లా కొనుగోలు చేయునట్లు తెలుస్తుంది. విలాసవంతమైన విల్లా రిజిస్ట్రేషన్ పనులు కూడా చకచకా జరిగిపోతున్నాయట. ఈ నేపథ్యంలోనే మహేష్ దుబాయ్ వెళ్లినట్లు సమాచారం. ఇక ఇప్పటికే మహేష్ మంచి బిజినెస్ మెన్ గా టాగ్ వేసుకున్నారు. పలు బిజినెస్ లలో వాటాలున్నాయి. ఎన్నో కమర్షియల్ యాడ్స్ లో నటిస్తున్నాడు. మల్టీప్లెక్స్, హోటల్స్ లాంటి వాటిలో మహేష్ వాటాలున్నాయి. ఇక తాజాగా మహేష్ దుబాయ్ లో విలాసవంతమైన విల్లా కొన్నాడనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి .

Exit mobile version