Site icon HashtagU Telugu

Harsha Sai : హర్షసాయిని బెట్టింగ్ మాఫియా దాచేసిందా..?

Harshasai Dubai

Harshasai Dubai

Youtuber Harsha Sai : ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి (Youtuber Harsha Sai) కోసం పోలీసులు గాలింపు ఇంకా కొనసాగుతూనే ఉంది. వైజాగ్ , ముంబై , గోవా ఇలా అనేక ప్రాంతాల్లో పోలీసులు జల్లాడ పట్టిన హర్షసాయి జడ మాత్రం పట్టుకోలేకపోతున్నారు. ప్రస్తుతం హర్ష సాయి ఎక్కడ ఉన్నాడనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది.

వారం రోజుల క్రితం తనను హర్షసాయి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసాడని చెప్పి బిగ్ బాస్ ఫేమ్ , OTT నటి మిత్రా శర్మ పోలీసులకు పిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. హర్షసాయి తో పాటు అతడి తండ్రి రాధాకృష్ణ ఫై కూడా ఫిర్యాదులో పేర్కొంది. హర్ష తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి దాదాపు రూ. 2 కోట్లు తన దగ్గరి నుండి తీసుకున్నాడని..తాము నటించిన సినిమా రైట్స్ ఇవ్వాలని బలవంతం చేసాడని.ఇవ్వను అనేసరికి తనను బ్లాక్ మెయిల్ చేయడం తో పాటు శారీరకంగా వాడుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు పలు సెక్షన్ల కింద సాయి ఫై కేసులు నమోదు చేసి అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వారం రోజులు అవుతున్న సాయి ని మాత్రం పట్టుకోలేకపోతున్నారు. హర్షసాయి దుబాయ్‌లో ఉన్నాడని, అతనికి బెట్టింగ్ మాఫియా ఆశ్రయం కల్పిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కేసు నమోదు అవుతుందని తెలిసి.. హర్షసాయి దేశం విడిచివెళ్లిపోయాడని, ఎక్కడ పోలీసులు అరెస్ట్‌ చేస్తారేమో అని భయపడి.. అతను దుబాయ్‌ (Dubai)కి వెళ్లి తలదాచుకున్నాడంటూ.. కేసు పెట్టిన యువతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. హర్షసాయికి బెట్టింగ్‌ మాఫియాతో మంచి డీలింగ్స్‌ ఉన్నాయని, బహుషా వాళ్లే.. దుబాయ్‌లో అతనికి ఆశ్రయం కల్పిస్తున్నారేమో అంటూ వాళ్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ నిజంగానే అతను దుబాయ్‌లో ఉంటే.. అతన్ని ఎప్పటి వరకు అరెస్ట్‌ చేస్తారు? ఇండియాకు తీసుకొచ్చేందుకు ఏవైనా రూల్స్‌ అడ్డుపడతాయా? ఇలా అనే విషయాలపై సోషల్‌ మీడియాలో సైతం తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.

హర్షసాయి బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రయోట్‌ చేసి కోట్లు వెనకేసుకున్నాడని, అతను బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రయోట్‌ చేయడం వల్ల ఎంతో మంది అమాయకులు బెట్టింగ్స్‌ పెట్టి.. అప్పులు పాలై.. ఆత్మహత్యలు చేస్తుకున్నారని హర్షసాయిపై కొంతమంది ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దుబాయ్‌లో బెట్టింగ్‌ మాఫియానే అతనికి ఆశ్రయం కల్పిస్తుందని అంత నమ్ముతున్నారు. మరి నిజంగా సాయి దుబాయ్ లోనే ఉన్నాడా..? అనేది పోలీసులు తేల్చాల్సి ఉంది.

Read Also : Health Tips : శరీరంలో కనిపించే ఈ లక్షణాలు క్యాన్సర్ కణాల అభివృద్ధి కావచ్చు!