Harom Hara Teaser : ప్రభాస్ చేతుల మీదుగా సుధీర్ బాబు ‘హరోం హర’ టీజర్ విడుదల

భయపడితే సింగాన్ని కూడా సేద్యానికి వాడుకుంటారు.. అది భయపెడితేనే అడివికి రాజని ఒళ్లు దగ్గరపెట్టుకుంటారు

Published By: HashtagU Telugu Desk
Heromhara

Heromhara

సుధీర్ బాబు (Sudheer Babu) పాన్ ఇండియా లో అడుగుపెట్టబోతున్నారు. కుటుంబ కథ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకువస్తున్న సుధీర్..ఇప్పుడు యాక్షన్ మూవీ ‘హరోమ్ హర’ (Harom Hara) తో పాన్ ఇండియా గా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఇప్పటికే ఈ చిత్ర ఫస్ట్ లుక్ తో అంచనాలను రెట్టింపు చేయగా.. ఇక ఇప్పుడు టీజర్ తో అమాంతం సినిమా ఫై భారీ అంచనాలు నెలకొల్పారు. ఈ సినిమా టీజర్‌ను ఐదు భాషల్లో విడుదల చేసారు. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషలలో విడుదల చేసారు. తెలుగు లో ప్రభాస్ (Prabhas) రిలీజ్ చేయగా..మిగతా భాషల్లో మమ్ముట్టి, టైగర్ ష్రాఫ్, విజయ్ సేతుపతి, కిచ్చా సుధీప్ లు విడుదల చేసి ఆసక్తి రేపారు.

టీజర్ (Harom Hara Teaser) విషయానికి వస్తే.. ‘అందరూ పవర్ కోసం గన్ పట్టుకుంటారు, కానీ ఇది యాడేడో తిరిగి నన్ను పట్టుకుంది, ఇది నాకేమో చెప్తావుంది, అది నీ గొంతు నుంచి వినపడతావుంది’ అని సుధీర్ బాబు చెప్పే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమైంది. ఈ డైలాగ్ చెప్పే క్రమంలో ఒక ఆసక్తికర సీన్స్ చూపించారు. ‘ఈ కాలంలో అంతా మంచిగా ఉంటే ముంచేస్తారు. తెగిస్తేనే తెగ్గి నడుసుకుంటారు’ అంటూ హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఎంత రఫ్‌గా ఉండబోతోందో చూపించారు. ‘భయపడితే సింగాన్ని కూడా సేద్యానికి వాడుకుంటారు.. అది భయపెడితేనే అడివికి రాజని ఒళ్లు దగ్గరపెట్టుకుంటారు’ అని సుధీర్ బాబు చెప్పే డైలాగ్ ఇది ఆదిపత్య పోరుకు సంబంధించిందని అర్థమవుతోంది. మొత్తానికి ఒక గ్యాంగ్ స్టర్ మూవీతో సుధీర్ పాన్ ఇండియా మార్కెట్ లో అడుగుపెట్టబోతున్నారు.

హరోమ్ హర సినిమాలో సుధీర్ బాబు సరసన మాళవిక శర్మ కథానాయికగా నటిస్తోంది. కన్నడ నటుడు అర్జున్ గౌడ సునీల్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించారు. సుమంత్ జీ నాయుడు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. చేతన్‌ భరద్వాజ్ నేపథ్య సంగీతం సమకూర్చగా, అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీ అందించారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర్ సిమిమాస్ బ్యానర్‌పై హరోమ్ హర సినిమా రూపొందుతోంది. వచ్చే ఏడాది ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Read Also : Extra Ordinary Man Trailer : నితిన్ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ ట్రైలర్ వచ్చేసింది.. ఇది నిజంగానే ఎక్స్‌ట్రా ఆర్డినరీ

  Last Updated: 27 Nov 2023, 06:56 PM IST