Raviteja మాస్ మహరాజ్ రవితేజ హరీష్ శంకర్ కాంబోలో షాక్, మిరపకాయ్ తర్వాత వస్తున్న హ్యాట్రిక్ సినిమా మిస్టర్ బచ్చన్. ఆగష్టు 15న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా ఓ పక్క ప్రమోషనల్ కంటెంట్ రెడీ అవుతుంటే మరోపక్క సినిమా లాంగ్ షూట్ అయిపోయింది అంటూ డైరెక్టర్ హరీష్ శంకర్ సోషల్ మీడియాలో పెట్టిన న్యూస్ కి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. సినిమా రిలీజ్ కు నెల, రెండు నెలలు ముందే కంప్లీట్ చేసి ప్రమోషన్స్ రిలీజ్ కంటెంట్ ఇలా ప్రిపేర్డ్ గా ఉంటారు.
కానీ రిలీజ్ ఇంకా 10 రోజులు మాత్రమే ఉంటే ఎంచక్కా సినిమా నేటితో పూర్తైంది అంటూ హరీష్ శంకర్ మెసేజ్ చేయడం మాస్ రాజా ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. ఆయన డైరెక్షన్ అంటే ఎంత పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఉంటుందో ఈ విషయాన్ని బట్టి అర్ధమవుతుంది. హరీష్ శంకర్ 10 రోజుల్లో సినిమా రిలీజ్ ఉన్నా షూటింగ్ పూర్తి చేయకపోవడంపై ఆడియన్స్ లో మిశ్రమ స్పందన వస్తుంది.
మిస్టర్ బచ్చన్ రిలీజైన టీజర్, సాంగ్స్ అయితే సినిమా మాస్ ఆడియన్స్ కి అన్ని విధాలుగా ట్రీట్ అందించేలా ఉందని అర్ధమవుతుంది. ఐతే రవిఏజ ఫ్యాన్స్ కి ఈ సినిమాతో ఆయన తప్పకుండా హిట్ కొట్టాలన్న ఆలోచన ఉంది. ధమాకా తర్వాత హిట్టు లేని మాస్ రాజా మిస్టర్ బచ్చన్ తో బంపర్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు.
హ్యాట్రిక్ సినిమా అందులోనూ హరీష్ శంకర్ సినిమా అంటే పక్కా పైసా వసూల్ బొమ్మ కాబట్టి కచ్చితంగా బచ్చన్ సాబ్ మీద అంచనాలు పెట్టుకోవడంలో తప్పులేదని చెప్పొచ్చు. మరి సూపర్ హిట్ కాంబో Mr Bacchan ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
Also Read : Ilayaraja : ఇళయరాజా ఇష్యూ అలా డీల్ క్లోజ్ చేసిన మంజుమ్మల్ బోయ్స్ నిర్మాత..!