మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్(Harish Shankar) గత మూడేళ్ళుగా పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh) సినిమా మీదే ఆగిపోయారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల బిజీ వల్ల డేట్స్ ఇవ్వకపోవడంతో సినిమా వాయిదాలు పడుతూ వస్తుంది. మధ్యలో ఓ పది రోజులు షూట్ చేసి ఆపేశారు. మరో నాలుగు నెలల్లో ఏపీ ఎన్నికలు రాబోతున్నాయి. పవన్ ఇప్పట్లో సినిమాలకు డేట్స్ ఇవ్వలేడు. ఎన్నికల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేము.
దీంతో మూడేళ్ళుగా ఏ సినిమా తీయకుండా పవన్ కోసం ఎదురుచూసిన హరీష్ శంకర్ ఇక ఆ సినిమాని పక్కన పెట్టేసాడు. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పక్కన పెట్టేసి రవితేజతో(Raviteja) కొత్త సినిమా ప్రకటించాడు. దీంతో పవన్ అభిమానులు ఇప్పట్లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా లేనట్టే అని నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
హరీష్ శంకర్ – రవితేజ కాంబోలో గతంలో షాక్, మిరపకాయ సినిమాలు వచ్చాయి. షాక్ కమర్షియల్ గా ఫెయిల్ అయినా విమర్శల ప్రశంసలు అందుకుంది. మిరపకాయ్ సినిమా మాత్రం సూపర్ హిట్ అయింది. ఇప్పుడు వీరి కాంబోలో మూడో సినిమా ప్రకటించడంతో రవితేజ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో ఈ సినిమాని ప్రకటించారు. జనవరిలో ఈ సినిమా షూట్ కి వెళ్లనుందని సమాచారం.
“ Hitting the floors Soon” https://t.co/IIEoJDC7B2
— Harish Shankar .S (@harish2you) December 13, 2023
Also Read : Vijay Deavarakonda : విజయ్ దేవరకొండపై అసభ్యకర వార్తలు ప్రసారం.. అనంతపురం వ్యక్తి అరెస్ట్..