Site icon HashtagU Telugu

Puri Jagannadh – Harish Shankar : ఇండిపెండెన్స్ డే రోజు గురు శిష్యుల మధ్య పోటీ.. నెగ్గేదెవరో..?

Harish Shankar Puri Jagannadh Fight on Independence Day with Mr Bachchan and Double Ismart Movies

Harish Shankar Puri Jagannadh

Puri Jagannadh – Harish Shankar : ఈసారి ఇండిపెండెన్స్ డేకి వెంటనే వీకెండ్, ఆ తర్వాత రాఖీ రావడంతో చాలామందికి వరుసగా అయిదు రోజులు హాలిడేస్ వస్తున్నాయి. దీంతో ఈ వారం సినిమాల పోటీ ఎక్కువగానే ఉంది. రవితేజ మిస్టర్ బచ్చన్, రామ్ డబల్ ఇస్మార్ట్, విక్రమ్ తంగలాన్, ఎన్టీఆర్ బామ్మర్ది నితిన్ ఆయ్ సినిమాలు ఇండిపెండెన్స్ డే రోజు రిలీజ్ కాబోతున్నాయి.

అయితే ముఖ్యంగా మిస్టర్ బచ్చన్(Mr Bachchan) – డబల్ ఇస్మార్ట్(Double Ismart) మధ్యే పోటీ ఉంది. ఈ రెండు సినిమాలని గురుశిష్యులు తెరకెక్కించడం గమనార్హం. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా రామ్, కావ్య థాపర్ జంటగా సంజయ్ దత్ విలన్ గా డబల్ ఇస్మార్ట్ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

ఇక పూరి జగన్నాద్ దగ్గర శిష్యుడిగా చేసి హరీష్ శంకర్ దర్శకుడు అయిన సంగతి తెలిసిందే. ఆర్జీవీ, పూరి.. ఈ ఇద్దరు డైరెక్టర్స్ కి హరీష్ శంకర్ రెస్పెక్ట్ ఇస్తారు. ఇప్పుడు అలాంటి గురువుతోనే పోటీ పడబోతున్నాడు. రవితేజ, భాగ్యశ్రీ భోర్సే జంటగా జగపతి బాబు విలన్ గా తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ సినిమా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమా కూడా ఆగస్టు 15న రిలీజ్ కానుంది. ఈ సినిమాపై కూడా అంచనాలు బానే ఉన్నాయి.

అసలు మిస్టర్ బచ్చన్ ఆగస్టు 15 రిలీజ్ చేయాలనీ అనుకోలేదు. కానీ చివరి దశలో సడెన్ గా ఈ డేట్ అనౌన్స్ చేసి రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఈ రెండు సినిమాల మధ్య పోటీ ప్రేక్షకులకు, ఫ్యాన్స్ కి ఆసక్తి కలిగిస్తుంది. పూరి జగన్నాధ్, హరీష్ శంకర్.. ఈ గురుశిష్యుల పోటీలో ఇండిపెండెన్స్ డే రోజు ఎవరు నెగ్గుతారో చూడాలి మరి.

 

Also Read : Kalki In Ott: ఈ నెలలోనే కల్కి ఓటీటీ రిలీజ్..? ఆ 6 నిముషాలు కట్ చేసారు అని టాక్