Site icon HashtagU Telugu

Harish Shankar : డైరెక్టర్ హరీష్ శంకర్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా

Harish Helps

Harish Helps

డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) మరోసారి వార్తల్లో నిలిచారు. మాములుగా అయితే వివాదాస్పద వార్తలతో ఎక్కువగా నిలుస్తుంటారు..కానీ ఈసారి మాత్రం సాయం చేసి వార్తల్లో నిలిచారు. రోడ్ ఫై ఒక కారు నిలిచిపోవడం చూసిన హరీష్ అండ్ మైత్రి నిర్మాతల్లో ఒకరైన రవి శంకర్..వెంటనే తమ కారుదిగి.. ఆ కారు సమస్య ఏంటో తెలుసుకొని.. స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేసారు. కానీ స్టార్ట్ కాకపోయేసరికి..స్వయంగా ఎండలో ఆ కారును తోస్తు కనిపించారు. దీనిని స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం తో వైరల్ గా మారింది. హరీష్ చేసిన పనికి ఆయన అభిమానులు , నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

గబ్బర్ సింగ్ తో టాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న హరీష్..మరోసారి పవన్ తో సినిమా చేసే ఛాన్స్ దక్కినప్పటికీ..పవన్ రాజకీయాలతో బిజీ గా ఉండడం తో కొంత షూటింగ్ చేసి బ్రేక్ ఇచ్చారు. ఎన్నికలు పూర్తి అయినా తర్వాత మళ్లీ ఈ సినిమా స్టార్ట్ చేయనున్నారు. ప్రస్తుతం రవితేజ తో ‘మిస్టర్ బచ్చన్’ సినిమా చేస్తున్నాడు. గతంలో వీరిద్దరి కలయికలో షాక్ , మిరపకాయ్ చిత్రాలు వచ్చాయి. హ్యాట్రిక్ మూవీ గా ఇప్పుడు మిస్టర్ బచ్చన్ రాబోతుంది. రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటూ వస్తుంది.

Read Also : Niharika: నిహారిక ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతంటే.. తల్లి, తండ్రికి అలాంటి గిఫ్ట్ ఇచ్చిందా!