Harish Shankar : హరీష్ శంకర్ ఆర్జీవీ, పూరి జగన్నాధ్ దగ్గర శిష్యరికం చేసిన సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరూ అంటే హరీష్ శంకర్ కి చాలా ఇష్టం కూడా. అయితే తాజాగా హరీష్ శంకర్ కి – పూరి జగన్నాధ్ కి సినిమా రిలీజ్ డేట్స్ వల్ల గొడవలు వచ్చాయని వార్తలు వచ్చాయి. పూరి జగన్నాద్ దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కుతున్న డబల్ ఇస్మార్ట్ సినిమా ఆగస్టు 15 రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీనికి ఛార్మి నిర్మాత.
అయితే తాజాగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న మిస్టర్ బచ్చన్ సినిమాని కూడా ఆగస్టు 15నే రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీంతో గురు – శిష్యుల మధ్య పోటీ నెలకొంది. ఇటీవల ఛార్మి సోషల్ మీడియాలో హరీష్ శంకర్ ని, రవితేజని అన్ ఫాలో చేసింది. దీంతో సినిమా రిలీజ్ డేట్ వల్లే వీరి మధ్య గొడవలు వచ్చాయని, అందుకే సోషల్ మీడియాలో కూడా అన్ ఫాలో చేసారని వార్తలు వచ్చాయి.
తాజాగా జరిగిన మిస్టర్ బచ్చన్ టీజర్ లాంచ్ ఈవెంట్ లో హరీష్ శంకర్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. హరీష్ శంకర్ మాట్లాడుతూ.. పూరి గారు నాకు గురువు. నాకు, ఆయనకు గొడవలు ఏమి లేవు. నన్ను మొదట్నుంచి సపోర్ట్ చేసింది పూరి గారే. ఈ రిలీజ్ క్లాష్ గురించి అసలు పూరి గారు పట్టించుకోరు. మేము అసలు ఆ డేట్ రావాలని కూడా అనుకోలేదు. కానీ అప్పుడు హాలిడేస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మా డిస్ట్రిబ్యూటర్స్ అప్పుడు రిలీజ్ చేయమన్నారు. అందుకే మేము ఆగస్టు 15 డేట్ అనౌన్స్ చేసాము. ఇక ఛార్మి గారు సోషల్ మీడియాలో ఎవర్ని ఫాలో చేయాలి, ఎవర్ని అన్ ఫాలో చేయాలి అనేది ఆమె ఇష్టం అని క్లారిటీ ఇచ్చారు.
Also Read : Raviteja Mr Bacchan Teaser : మిస్టర్ బచ్చన్ టీజర్.. మాస్ రాజాని పర్ఫెక్ట్ గా వాడేసిన డైరెక్టర్..!
మరి పూరి జగన్నాధ్ డబల్ ఇస్మార్ట్ – హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ సినిమాల్లో ఏది బాక్సాఫీస్ వద్ద నిలబడుతుందో చూడాలి.