Harish Shankar : ప్రెస్ నోట్‌తో చిరంజీవి మూవీ కెమెరామెన్‌కి.. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన హరీష్ శంకర్..
News Desk
Harish Shankar Fires On Chiranjeevi Movie Camera Men Chota K Naidu Comments
Harish Shankar : టాలీవుడ్ మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్.. తన సినిమా డైలాగ్స్ లోనే కాదు, ఆఫ్ స్క్రీన్ తన మాటల్లో కూడా ఒక ఫైర్ ని చూపిస్తూ ముందుకు సాగుతుంటారు. ఈక్రమంలోనే టాలీవుడ్ స్టార్ కెమెరా మెన్ చోట కె నాయుడుకి సీరియస్ వార్నింగ్ ఇస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’ చేస్తున్న చోట కె నాయుడు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో హరీష్ శంకర్ ని అవమానపరిచేలా కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్ ‘రామయ్య వస్తావయ్య’ సినిమా చేసేటప్పుడు.. హరీష్ శంకర్ తన పనికి అడ్డుపడి కోపం తెప్పించేసాడని, అందుకే ఆ మూవీని తనకి నచ్చినట్లు చేసి వదిలేసా అంటూ చెప్పుకొచ్చారు.
ఇక ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యి హరీష్ శంకర్ వరకు వెళ్లాయి. కాగా చోట కె నాయుడు హరీష్ శంకర్ గురించి ఇలా మాట్లాడడం మొదటిసారి కాదట. గతంలో కూడా పలు ఇంటర్వ్యూల్లో ఇలాగే మాట్లాడారట. అయితే చోట కె నాయుడు పై ఉన్న గౌరవంతో ఇన్నాళ్లు తాను ఏమి మాట్లాడాడలేదని, కానీ ప్రతిసారి ఇలా మాట్లాడడం తనకి ఆగ్రహం కలిగించినట్లు చెప్పుకొచ్చారు.
తన ప్రస్తావన రాకున్నా ప్రతిసారి ఆ విషయాన్ని తీసుకువచ్చి తనని నెగటివ్ చేస్తూ మాట్లాడుతుంటే తనకి బాధ కలుగుతుందని హరీష్ శంకర్ పేర్కొన్నారు. చోట కె నాయుడు విషయంలో కూడా తనకి నచ్చనవి ఉంటాయని, కానీ వాటి గురించి తాను ఎప్పుడు ఎక్కడా మాట్లాడి ఆయనని అగౌరవపరిచేలా చేయలేదని చెప్పుకొచ్చారు.
ఇప్పటికి చోట పై తనకి గౌరవం ఉందని, అది పోగొట్టుకోవద్దని పేర్కొన్నారు. అలా కాకుండా ఇంకా అలాగే మాట్లాడతానంటే తాను ఇక ఉపేక్షించేది లేదని చెప్పుకొచ్చారు. మరి దీనిపై చోట కె నాయుడు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.